ప్రముఖ బుల్లితెర వ్యాఖ్యాత
అనసూయ భరద్వాజ్ తన అందచందాలతో స్టార్ హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు చేజిక్కించుకున్నారు. ఇటీవల విడుదలైన చావు కబురు చల్లగా సినిమాలో "పుట్టు వేళా తల్లికి.. నువ్వు పురిటి నొప్పి వైతివి" అంటూ సాగే స్పెషల్ సాంగ్ లో
అనసూయ అద్భుతమైన నాట్యం చేసి బాగా అలరించారు. మే ఏడవ తేదీన ఆహా ఓటీటీ వేదికగా థాంక్యూ బ్రదర్ సినిమాతో ఆమె అలరించనున్నారు. అయితే
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో ఒక నెగిటివ్ రోల్ లో
అనసూయ నటిస్తారని తెలుస్తోంది. కొద్ది వారాల క్రితం ఆమె పుష్ప టీమ్ తో జాయిన్ అయ్యి కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు.
ఐతే రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో సహజంగా నటించి మెప్పించిన
అనసూయ మళ్లీ
సుకుమార్ "పుష్ప" సినిమాలో అలాంటి పాత్రే చేస్తున్నారట. రంగస్థలం సినిమాలో తనకు
సుకుమార్ ఎలాంటి పాత్ర ఇచ్చారో అచ్చం అదే తరహాలో పుష్ప సినిమాలో కూడా ఒక పాత్ర తనకు ఇచ్చారని ఒక
యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. అయితే తన పాత్ర గురించి ఎక్కువగా తాను చెప్పలేనని కానీ రంగమ్మత్త పాత్ర మళ్ళీ పుష్ప లో రిపీట్ కాబోతోందని ఆమె క్లారిటీ ఇచ్చారు.
ఈ ఊర
మాస్ యాక్షన్ డ్రామా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ మూవీలో
డ్రైవర్ పుష్ప
రాజ్ గా నటిస్తున్న
అల్లు అర్జున్ తాను అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం దుంగలను సంరక్షించేందుకు ప్రత్యర్థులతో
కత్తి తో భయంకరమైన ఫైట్స్ చేస్తారని ఒక సోర్స్ వెల్లడించింది.
సినిమా మొత్తం లో
అల్లు అర్జున్ చేసే ఫైట్స్ హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది.
రష్మిక మందన, పహద్ ఫాజిద్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ
సినిమా హిందీ, తెలుగు,
తమిళ్,
కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.