
’టీఎన్‌గారి మరణవార్త విని చాల బాధ పడ్డాను. ఆయన ఇంటర్వ్యూలను కొన్నిటిని చూశాను. ఇంటర్వ్యూల్లో అతిథులతో ఆయన మాట్లాడే తీరు అద్భుతం. వారి కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను‘ నాని
‘నమ్మలేని వార్త. నా ఫ్రెండ్ టీఎన్‌ఆర్ ఇక లేరనే వార్త జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. కరోనా కాస్తయినా దయ చూపించు. ఇక మా వల్ల కాదు‘ డైరెక్టర్ మారుతి
‘టీఎన్‌ఆర్ గారు లేరనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఫ్యామిలీకి నా సానుభూతి’: డైరెక్టర్ గోపీచంద్ మలినేని
‘మీతో నేను చేసిన రెండు సుదీర్ఘమైన ఇంటర్వ్యూలు నాకు ఇంకా గుర్తున్నాయి. మీరు చనిపోవడం మా ఇంట్లో అందరినీ కదిలించింది. మీ మాటలు, మీ ప్రేమ, సహనం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. మిస్ యూ సర్’: విజయ్ దేవరకొండ
‘మీ మరణం మాలో బాధను మిగిల్చింది. ఇది ఒక పీడకల. మంచి మనిషి. సంవత్సరం క్రితం ఆయనతో చేసిన ఒక ఇంటర్వ్యూ నా కెరీర్‌లో బెస్ట్ ఇంటర్వ్యూగా నిలిచింది. ఆయన సన్నిహితులకు నా సంతాపం’: మంచు విష్ణు
విస్మయానికి గురయ్యాను. మిస్ యూ టీఎన్‌ఆర్‌గారు. – సందీప్ కిషన్
మీ ఆత్మకు శాంతి చేకూరాలి. – ఈషా రెబ్బ