
ఇక సినిమా విషయానికి వస్తే.. చిత్రంలో ఎక్కువభాగం పాత్రలు మంచివే. జానకి పాత్ర ప్రత్యేకంగా చెప్పాలి. హీరో, హీరోయిన్ల కలయిక, వారి మధ్య సంఘటనలు వంటివన్నీ సినిమా స్థాయిని పెంచేశాయి. ఈ చిత్రంలో హీరో ధనవంతుడని జానకికి ముందే తెలుసు. కమలినీ ముఖర్జీ ఇద్దరూ సంఘంపై బాధ్యత నెరవేర్చాలనే అనుకుంటుంటారు. మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల మేఘమాలలో కథానాయకుడు, మేఘమాల కోసం ఇలాగే గాలిస్తాడు. చిత్రంలో హీరో పాత్ర మోటారు సైకిల్ యాత్ర, చేగువేరాపై వచ్చిన 'మోటారు సైకిల్ డైరీ'ని గుర్తుకు తెస్తుంది.
ఓ డ్యాన్స్ ప్రోగ్రాంలో హీరోయిన్‌ను చూసి ఇష్టపడతాడు హీరో(శర్వానంద్). ఆమెతో మాట్లాడతాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె ఉన్నతభావాలు గల మహిళ. దాంతో అతడి ప్రేమను పూర్తిగా ఒప్పుకోదు. అయితే దాంతో అతడికి కోపం వస్తుంది. ఈ క్రమంలోనే ఆమె అతడికి దూరంగా వెళ్లిపోతుంది. ఆమె ప్రేమలో పీకల్లోతూ మునిగి హీరో ఆమెకోసం వెదుకులాట మొదలు పెడతాడు. అలా ఊళ్లకు ఊళ్లు తిరుగుతున్న సమయంలో అతడికి ఓ దొంగ(అల్లరి నరేశ్) స్నేహితుడు అవుతాడు.