ఎన్టీఆర్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెండితెరపై కథానాయకుడిగా... రాజకీయాల్లో ప్రజా నాయకుడిగా తనదైన ముద్రవేశారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. జాతీయస్థాయి రాజకీయాల్లోనూ కీలకపాత్ర పోషించారు. అలాంటి ఆయన మనవడిగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారు. ఇక వీరిద్దరి పరిచయం గురించి ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.


 ఎన్టీఆర్ పదకొండో ఏట.. ఓసారి 104 జ్వరం వచ్చిందట, పడుకుని ఉంటే హరికృష్ణ నుంచి ఫోన్‌ వచ్చిందట, 'వాణ్ని రెడీ చెయ్యి.. పెద్దాయన చూడాలనుకుంటున్నారు' అని చెప్పారట. తాతగారు చూడాలంట.. అని అమ్మ చెప్పగానే ఏదో తెలియని ఆనందం కలిగింది అని ఆయన పేర్కొన్నారు. తాతగారి పీఎస్‌ మోహన్‌ వచ్చి కారులో తీసుకెళ్లగా తాను ఒక్కడినే వెళ్లాననీ ఆ ఇంట్లోకి వెళ్లగానే చుట్టూ ఏదో తెలియని దైవత్వం అనిపించిదని ఆయన చెప్పుకొచ్చారు.



 ఇక ఓ గదిలోంచి ఏదో ధగధగా మెరిసే కాంతి ఉందని, కాషాయవస్త్రాల్లో మహానుభావుడు కింద కూర్చుని.. ‘రండి’ అన్నారు. నాకేమీ అర్థంకాలేదనీ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. అప్పుడు తన పేరును నందమూరి తారక రామారావు గా మార్చారని చెప్పుకొచ్చారు. ఇక కొన్ని రోజుల అమ్మ దగ్గర నుంచి ఆయనకు క్యారేజి వెళ్లగా, ఆ వంట బాగా నచ్చిందనీ దీంతో ఆమెను పిలిపించారని ఎన్టీఆర్ పేర్కొన్నారు. అమ్మ అలా కూర్చుని ఉండగా ‘ఇంతకాలం దూరంగా ఉన్నాము.. దాని గురించి పట్టించుకోవద్దు. నా వంశోద్ధారకుడు నీ కడుపున పుట్టాడు. నా అంతటివారిగా అతడిని తీర్చిదిద్దడంలో నీవంతు బాధ్యత నువ్వు నిర్వర్తించాలి. నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను’ అని అన్నారట. ఇక కొంతకాలానికి ఆయన  చనిపోయారనీ  ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: