'Rx 100' సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన అజయ్ భూపతి ''మహా సముద్రం'' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీనిని ఎంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా అయజ్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో టాలెంటెడ్ యాక్టర్స్ శర్వానంద్, సీనియర్ హీరో సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన శర్వా, సిద్దార్ధ్, అదితి, అనూ ఇమాన్యూయేల్, జగపతిబాబు ఫస్ట్ లుక్స్‌కి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర కో- ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.కాగా.. ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. వెంకట్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా.. కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. అయితే అందుకు కరోనా పరిస్థితులు చక్కబడాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి