కరోనా సమయంలో ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకుంటూ నిజమైన ఆపద్భాందవుడు అనిపించుకున్నారు ప్రముఖ నటుడు సోనూ సూద్. కరోనా లాక్‌డౌన్ ముందు వరకు సోనూసూద్‌ను మాములు నటుడిగానే చూసారు చాలా మంది. కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకు పోయిన కార్మికులను వాళ్ల స్వస్తలాలకు వెళ్లేలా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసి వారి మనసుల్లో దేవుడిగా నిలిచారు సోనూ సూద్. 

కొంత మంది కోసం ఏకంగా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాలు సైతం చేయలేని సాయాన్ని చేసి నిజమైన హీరో అనిపించుకున్నారు. కొంత మందికి ఉద్యోగాలు కూడా కల్పించారు. ఇప్పుడు దేశంలో పరిచయం అవసరం లేని వ్యక్తి సోనూ సూద్. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ అతడే రియల్ హీరో.అయితే ఈ రియల్ హీరోగా ఇంకొక గౌరవం దక్కింది అదేంటి అంటే సోనూసూద్ ని తమ మ్యాగజైన్ కవర్ ఫోటోగా పెట్టి ప్రముఖ మ్యాగజైన్ కంపెనీ స్టార్ డస్ట్ ఒక మ్యాగజైన్ ని విడుదల చేసింది. అయితే సోనూసూద్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ "తను నటుడుగా కెరీర్ మొదలుపెడుతున్నప్పుడు తన ఫొటోస్ ని ఎన్నోసార్లు స్టార్ డస్ట్ మ్యాగజైన్ కి పంపించను కానీ ప్రతిసాటి రిజెక్ట్ అయ్యేది అని ఇన్ని సంవత్సరాలకి తన ఫోటో స్టార్ డస్ట్ మ్యాగజైన్ మీద వచ్చింది అని ఆయన ఆనందాన్ని పంచుకున్నారు.

ఇక కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా కూడా సోనూ సూద్.. సాయం అని కోరిన వారికి సాయం అందజేస్తున్నారు. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో.. చాలా మంది ఆస్పత్రులలో బెడ్స్ దొరక్క, ఆక్సిజన్ కోరత కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోనూ సూద్ ఆక్సిజన్ కోరత లేకుండా చేసేందుకు ముందడుగు వేశారు. కరోనా రోగులకు ఆక్సిజన్ కోరతను నివారించడానికి ఇప్ప‌టికే ప‌లు చోట్లు ఆక్సిజ‌న్ ప్లాంట్ల నిర్మాణం చేప‌ట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: