నటసింహ బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా.. పలువురు ప్రముఖ స్టార్ లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇది బాలయ్య బాబుకి 61వ పుట్టిన రోజు సందర్భంగా తన సినిమాలోని కొన్ని పోస్టర్లతో ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచారు. అయితే ఇప్పుడు సింగర్ స్మిత కూడా ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన మంచితనానికి రూపంగా ఒక వీడియో ని రూపొందించి షేర్ చేశారు. ఆ వీడియో ఏంటో ఒకసారి తెలుసుకుందాం.


సింగర్ స్మిత మాట్లాడుతూ.."ఎవరికైనా ఏదన్నా పెట్టాలన్నా,ఎవరినైనా మందలించాలన్నా, చివరికి కొట్టాలన్నా సరే ఆయనకే చెల్లు..బాలకృష్ణ గారు చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారు , మనసు లోపల ఒకటి పెట్టుకొని బయట ఇంకోరకంగా మాట్లాడే వ్యక్తి కాదు. ఏదైనా ముఖం మీద చెప్పగలిగే వ్యక్తి. ఏదైనా తేడా వస్తే ఇక అంతే... ఆయనతో కలిసి పని చేసే వారంతా ఏమంటారంటే , సహాయం చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా" అని అంటూ చెప్పుకొచ్చింది సింగర్ స్మిత.


" అయితే నేను ఈరోజు ఇలా పంచుకోవడానికి గల కారణం ఏంటి అంటే.. సరిగ్గా 2 నెలల కిందట ఒక న్యూస్ రిపోర్టర్ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. వాళ్ళ కుమారుడు ప్రాణాపాయ  పరిస్థితి లో ఉన్నాడని, అతని మొత్తం ఆస్తి అమ్మినా కూడా కుమారుడి ట్రీట్మెంట్ కి సరిపోయిందని చెప్పుకొచ్చాడు.. ఇంకా ట్రీట్మెంట్ మిగిలి ఉంది. దానికి చాలా ఖర్చు అవుతుందని చెప్పారు. కానీ అతను నన్ను ఎందుకు అలా అడిగారు నాకు అర్థం కాలేదు.అతను ఎవరినైనా అడగొచ్చు ..ఏదైనా అడగవచ్చు కానీ నన్ను అడగగా, నేను దీనికి ఎలాంటి సహాయం చేయలేను చెప్పలేక.. నాకు రెండు నిమిషాల సమయం కావాలని అడిగాను..


ఇక అప్పట్లో ఏం చేయాలో తెలియక నేను ఆలోచించకుండానే బాలకృష్ణ గారికి మెసేజ్ పెట్టేశాను. అది ఏంటంటే..సార్ నేను మీతో రెండు నిమిషాలపాటు మాట్లాడాలి. నాకు మీరు సమయం కేటాయిస్తారా ? అని .ఇక మెసేజ్ అలా పెట్టానో లేదో ఐదు నిమిషాల్లోనే నాకు ఫోన్ వచ్చింది. బాలకృష్ణ గారే ఫోన్చేసి మరీ అడిగారు. నేను జరిగిన విషయం అంతా ఆయనకు చెప్పాను. సార్ వెంటనే ఏమి ఆలోచించకుండా రిపోర్ట్స్ అన్ని పంపించు.. నేను చూసుకుంటాను.. మీరు దిగులు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. సరిగ్గా మూడు గంటల లోపే నాకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. మేడం మేము అంతా చూసుకుంటాము. అబ్బాయి వివరాలు మాకు తెలియజేయండి అంటూ చెప్పారు. అంతేకాకుండా రేపు హాస్పిటల్ కి వచ్చి కావలసిన చికిత్స చేయించుకోండి అని చెప్పారు..



అందుకే కేవలం ఒక్క మెసేజ్ పెడితేనే ఆయన వెంటనే స్పందించి, ఒక బాలుడి జీవితాన్ని నిలబెట్టారు.మీకు  ఎప్పుడూ రుణపడి ఉంటాము అని సింగర్ స్మితా చెప్పుకొచ్చారు. అందరికీ ఎన్నో రకాలుగా సహాయపడే మీరు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆమె తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: