అప్పట్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న పర్వీన్ బాబి 2005లో ముంబైలో తన ఫ్లాట్ లో శవంగా కనిపించారు. చనిపోయిన రెండు రోజుల వరకు ఆమె మృతదేహాన్ని క్లైమ్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ప్రఖ్యాత నటులు దర్శకులు అయినా భగవాన్ దాదా సినిమాలు ఫ్లాప్ అవడంతో వల్ల ఇల్లు, కారు అమ్మేసి ముంబైలోనీ ఛాల్ లో నివసించారు. మోడల్ గీతాంజలి డ్రగ్స్ కి బానిసై సంపాదించినదంతా పోగొట్టుకుని సౌత్ ఢిల్లీ లో యాచిస్తు కనిపించారు. అలాగే పనిమనిషి గా కూడా పనిచేశారు.
ప్రముఖ గాయకులు ఓ.పి.నయ్యర్ మద్యానికి బానిసై అయి కుటుంబానికి దూరమయ్యారు. తన దగ్గరికి ఇంటర్వ్యూ కోసం అడగడానికి వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడం కోసం మద్యం ఇంకా డబ్బులు తీసుకునే వారు. చనిపోయే ముందు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు నయ్యర్. 

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి