మాస్ రాజా రవితేజ హీరోగా కమర్షియల్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వెంకీ. 2004 లో విడుదలైన ఈ సినిమా లో స్నేహ హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రవితేజ స్నేహితులుగా చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించగా హాస్య ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ట్రైన్ లో ఫస్ట్ హాఫ్ మొత్తం  మంచి కామెడీ తో ఎంటర్టైన్ చేసింది సినిమా. ముఖ్యంగా వేణుమాధవ్ తో కలిసి ట్రైన్  వీరు చేసే అల్లరి అంతా ఇంతా కాదు.

జాతకాల పిచ్చి ఉండే హీరో ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా అతని మిత్రబృందం ఒకరి చేతిలో మోసపోతుంది. అదే సమయంలో అదృష్టవశాత్తూ వారు పోలీస్ ప్రవేశపరీక్షలో అనుకోకుండా నెగ్గుతారు. ట్రైనింగ్ కోసం స్నేహితులతో కలిసి  హైదరాబాద్ కి వెళ్లాల్సి వస్తోంది. ట్రైన్ లో హీరోయిన్ ను చూసి ప్రేమిస్తాడు హీరో.. టుడే హీరోయిన్ ఫాదర్ తో గొడవ పడతాడు. ఆ గొడవలో చంపేస్తాను అని చెప్పిన హీరో ఆ తర్వాత తెల్లవారి లేచి చూస్తే మర్డర్ అయి ఉంటాడు హీరోయిన్ ఫాదర్. ఆ మర్డర్ చేసింది ఎవరు అని తెలుసుకునే ప్రయత్నమే ఈ సినిమా కథ.

ఈ సినిమాని ఎంతో హాస్యభరితంగా తెరకెక్కించాడు దర్శకుడు శ్రీనువైట్ల. దానికి తగ్గట్టుగా రవితేజ, అతని స్నేహితులు నటన కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బ్రహ్మానందం, ఏవీఎస్, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణు మాధవ్, కృష్ణ భగవాన్ వంటి నటీనటులు ఈ సినిమా హిట్ అవడంలో ఎంతో దోహదపడ్డారు. ముఖ్యంగా ఈ సినిమా సంగీత పరంగా సూపర్ హిట్ గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం చాలా బాగుంది. శ్రీను వైట్ల తన స్టైల్ ఏమాత్రం మిస్ చేయకుండా ఎంతో మనసుపెట్టి చేసిన సినిమా వెంకీ. రవితేజ కెరీర్ లోనే ఇది బిగ్ హిట్ చిత్రంగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: