రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడిగా ఆనంద్ దేవ‌ర‌కొండ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్ప‌టికే చేసిన సినిమాల‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇంతకుముందు చేసిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా తర్వాత ఆనంద్ హీరోగా చేస్తున్న సినిమా పుష్పక విమానం. కొత్త డైరెక్ట‌ర్ దామోదర ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. మిడిల్ క్లాస్ హిట్‌తో ఆనంద్ మంచి జోరుమీదున్నాడు.

ఇక ఈ మూవీలో ఇప్ప‌డు గీత్ సైని హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ హీరో విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్ తోపాటు టాంగా ప్రొడక్షన్స్ క‌లిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి, ప్రదీప్ ఎర్రబెల్లిలు మూవీకి డ‌బ్బుల పెడుతున్నారు. భారీగా  సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే అన్ని ప‌నులు పూర్తి చేసుకున్న పుష్పక విమానం మూవీ విడుదలకు త్వ‌ర‌లోనే రెడీ అవుతోంది.

 
ఈ క్ర‌మంలో ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టిన మూవీ మేకర్స్ సిలకా అనే ప్ర‌త్యేక‌మైన సాంగ్‌ను లిరికల్ వీడియోతో విడుద‌ల చేశారు. అయితే ఈ పాట‌ను రామ్ మిరియాల స్వరపరిచ‌గా.. యూత్ ను మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకునేలాగా ఉంది. ఇక దీని త‌ర్వాత మరో పాటను వదలడానికి చిత్ర బృందం సిద్ధం అవుతోంది. కళ్యాణం అంటూ సాగే ఈ పాట‌కు సంబంధించిన లిరికల్ వీడియోను స్టార్ హీరోయిన్ అయిన సమంత విడుదల చేస్తుంద‌ని మేకర్స్ ప్రకటించారు.

ఇక జూన్ 18న ఉదయం 11 గంటలకు కళ్యాణం లిరికల్ వీడియో సాంగ్ ను సమంత చేత‌లు మీదుగా విడుదల చేయనున్నారు. హీరో హీరోయిన్ల పెండ్లి సందర్భంగా వచ్చే ఈ సాంగ్‌ణు రామ్ మిరియాల ట్యూన్ కంపోజ్ చేశాడు. అయితే గీత రచయిత అయిన కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించార‌ని స‌మాచారం. యువ సంచలన సింగ‌ర్‌ సిధ్ శ్రీరామ్ తో పాటు సింగ‌ర్ మంగ్లీ కలిసి ఈ పాటను పాడారు. పుష్పక విమానం మూవీకీ హెస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందించగా రవితేజ గిరిజాల ఈనే ఎడిట‌ర్ ఎడిటింగ్ వర్క్ చూశారు.




మరింత సమాచారం తెలుసుకోండి: