ప్రతి సినీ ఇండస్ట్రీలో తమ హీరో సినిమా వస్తోందంటే చాలు.. అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేపడతారు. కామన్ గా ఒకే హీరోతో వచ్చిన సినిమాలలో ఒక సినిమా హిట్ అయితే మరో సినిమా ఫట్ అవుతుంటాయి.. లేదా ఆవరేజ్ గా నిలుస్తుంటాయి. కానీ వరుసగా ఒకే హీరో ఏకంగా 6 హిట్ సినిమాలతో డబుల్ హ్యాట్రిక్  సాధిస్తే ఇక అభిమానులకు పండగే. ఇక అలాంటి డబుల్ హ్యాట్రిక్ సాధించిన వారిలో  కొందరి హీరోల గురించి  తెలుసుకుందాం. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు వంటి హీరోలు 4 సార్లు  సాధించారు. ఇక కృష్ణ, చంద్రమోహన్,శోభన్ బాబు వంటి హీరోలు కేవలం ఒక్కసారి మాత్రమే డబల్ హ్యాట్రిక్ కొట్టారు.


1). మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి హ్యాట్రిక్ ని 1987లో మిస్ అయ్యారు. 1987లో హిట్లర్ సినిమా తో మొదలుపెట్టి.. మాస్టర్, చూడాలని ఉంది, స్నేహం కోసం, బావగారు బాగున్నారా ఇలా వరుసగా ఐదు సినిమాలతో హిట్లు సాధించి, చివరి సినిమా ఇద్దరు మిత్రులతో డబుల్ హ్యాట్రిక్ మిస్సయ్యాడు. అంతేకాకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా వరుసగా ఐదు హిట్ లు కొట్టి హ్యాపీ సినిమాతో ప్లాప్ టాక్ తెచ్చుకొని డబుల్ హ్యాట్రిక్ మిస్సయ్యాడు.
2). నందమూరి బాలకృష్ణ:నందమూరి బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. 1986లో ముద్దుల కృష్ణయ్య, అనసూయమ్మ గారి అల్లుడు, సీతారామ కళ్యాణం, కలియుగ కృష్ణుడు, దేశోద్ధారకుడు, అపూర్వసహోదరులతో ఈ సినిమాలను మొత్తం ఒకే ఏడాదిలోనే విడుదల చేసి డబుల్ హ్యాట్రిక్ సాధించాడు.

3). నాగార్జున:అక్కినేని నాగార్జున 2002-2006 సంవత్సరం మధ్యకాలంలో వరుసగా సంతోషం, మన్మధుడు, శివమణి, నేనున్నాను, సూపర్, శ్రీరామదాసు వంటి చిత్రాలు చేసి డబుల్ హ్యాట్రిక్ సాధించాడు.


4) వెంకటేష్:విక్టరీ వెంకటేష్ సినిమాలు ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ఇక 1997 సంవత్సరంలోనే ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం రా, సూర్యవంశం, రాజా, ప్రేమంటే ఇదేరా వంటి సినిమాలతో హిట్ కొట్టి, చివరగా గణేష్ సినిమాతో ఫ్లాప్ గా మిగిలి, చివరగా డబుల్ హాట్రిక్ ను మిస్ అయ్యారు.


5)పవన్ కళ్యాణ్:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంత మంచి ఫాలోయింగ్ వుందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1997 - 2001 వరకూ నటించిన సినిమాలలో గోకులంలో సీత, సుస్వాగతం, తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలతో హిట్ కొట్టిన పవన్ ఇంకో సినిమా హిట్ కొడితే, డబుల్ హ్యాట్రిక్ కొడతారు అని అందరూ అనుకుంటున్న సమయంలో ,స్వీయ దర్శకత్వంలో వచ్చిన జానీ సినిమాతో డిజాస్టర్ గా మిగిలి, చివర్లో డబుల్ హ్యాట్రిక్ మిస్సయ్యారు.


అంతే కాకుండా ఇలా సాధించిన వారిలో రాజేంద్ర ప్రసాద్, నాచురల్ స్టార్ నాని కూడా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: