మాస్ మహరాజ్ రవితేజ సినిమా హిట్టైతే కాసుల వర్షం కురవాల్సిందే. రీసెంట్ గా క్రాక్ తో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేశాడు రవితేజ. గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వచ్చిన క్రాక్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. క్రేజీ వసూళ్లతో మాస్ రాజా ఖాతాలో మరో హిట్ పడ్డది. అయితే రవితేజ ఈ సినిమాలో కనిపించిన తీరు ఫ్యాన్స్ కు బాగా నచ్చేసింది. తమ హీరో నుండి ఇలాంటి సినిమాలే ఆశిస్తున్నామని మాస్ మహరాజ్ ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి సినిమా చేస్తున్నాడు రవితేజ. సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రవితేజ డ్యుయల్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తుంది. రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలాఉంటే నూతన దర్శకుడు శరత్ మండవ డైరక్షన్ లో రవితేజసినిమా చేస్తున్నారు. మరో సినిమా కూడా డిస్కషన్ స్టేజ్ లో ఉంది.  

అయితే రవితేజ ఈమధ్య తన రెమ్యునరేషన్ పెంచినట్టు తెలుస్తుంది. మొన్నటి వరకు 10 నుండి 12 కోట్ల దాకా తీసుకున్న రవితేజ ఇప్పుడు 17 కోట్లు ఇస్తేనే తను సినిమా చేస్తా అంటున్నాడట. సో మాస్ రాజా కూడా రెమ్యునరేషన్ ఈ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నాడన్నమాట. రవితేజతో సినిమా అంటే రెమ్యునరేషన్ తో కలుపుకుని ఈజీగా 30 కోట్లు దాటేస్తుంది. రవితేజ మార్కెట్ కు 40 నుండి 50 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ అవుతుంది. సో డిమాండ్ మేరకే రవితేజ తన రెమ్యునరేషన్ పెంచాడని చెప్పుకుంటున్నారు. మొత్తానికి మాస్ రాజా మళ్లీ సరైన ట్రాక్ లోకి వచ్చాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. రాజా ది గ్రేట్ తర్వాత హిట్టు కోసం క్రాక్ వరకు వెయిట్ చేసిన రవితేజ ఈసారి కథల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: