టాలీవుడ్ లో రెండు భాగాలుగా సినిమాలు తెరకెక్కించడం అనేది ఈ మధ్య ట్రెండ్ గా మారింది.
బాహుబలి సినిమా దీన్ని మొదలు పెట్టగా ఆ తర్వాత చాలా సినిమాలు రెండు పార్ట్ లుగా తెరకెక్కాయి. ఇదివరకు సినిమాలకు సీక్వెల్స్ వచ్చేవి కానీ ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కించడం వల్ల చాలా అడ్వంటేజేస్ ఉన్నాయని మేకర్స్ ఈ ఆలోచన ఎక్కువగా చేస్తున్నారు. ఒకే బడ్జెట్ తో రెండు సార్లు భారీ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించుకోవచ్చు. సినిమాపై బజ్ కూడా చాలా రోజులు ఉంటుంది.
అయితే కొంతమంది అభిమానులు కూడా తమ అభిమాన హీరోల సినిమాలను ఈ విధంగా చూడాలని అనుకుంటున్నారు. అలా స్టార్ హీరోల ఏ సినిమాలు రెండు పార్ట్ లుగా రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.
బాహుబలి సినిమా తర్వాత
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన
కేజిఎఫ్ సినిమా రెండు పార్టులుగా వస్తుండగా మొదటి పార్ట్ ఘన విజయాన్ని సాధించింది. ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన సెన్సేషన్ తో సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదే
డైరెక్టర్ ప్రభాస్ తో చేయబోతున్న సలార్ సినిమాని కూడా రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప.
అల్లు అర్జున్ హీరో గా చేస్తున్న ఈ
సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతుంది. దాదాపు షూటింగ్ పూర్తి కావస్తున్న టైంలో ఈ విషయం బయటకు వచ్చింది. పుష్ప కథను ఒక్క సినిమాతో చెప్పడం కష్టం అని రెండు భాగాలుగా అయితే
ఆడియన్స్ కు పుష్ప స్టోరీ కరెక్ట్ గా కన్వే చేయొచ్చు అనుకున్నారు సుకుమార్అయితే ఈ
సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. అయితే ఇప్పటివరకు అఫీషియల్ గా ఈ విషయాన్ని రీవీల్ చేయలేదు. దసరాకు మొదటి పార్ట్ ను, సంక్రాంతికి రెండో పార్ట్ ను విడుదల చేస్తారట.