మున్నా సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన వంశీ పైడిపల్లి బృందావనం, ఎవడు, ఊపిరి వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు. ఇటీవలే స్టార్ హీరో మహేష్ బాబుతో కలిసి మహర్షి సినిమా చేసిన ఈయన మరో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో ఇంకో విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తన ప్రతి చిత్రంలోనూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ దర్శకుడు ఇప్పుడు మరో సరికొత్త కథను సిద్దం చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదో మల్టీ స్టారర్ మూవీ అట. ఈ సినిమాని నాచురల్ స్టార్ నాని, తమిళ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించడానికి రంగం సిద్దం చేశారట దర్శకుడు వంశీ. 

ఇప్పటికే స్క్రిప్టు కు సంబంధించి మాటలు జరిగిపోయాయని, కథ నచ్చిన హీరో నాని మరియు క్రేజీ స్టార్ ధనుష్ ఇరువురూ కూడా ఈ మల్టీ స్టారర్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినబడుతున్నాయి.  యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకోనుందని టాక్ నడుస్తోంది. ఈ వార్తే కనుక నిజమైతే నాచురల్ స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరూ సూపర్ హీరోలు  తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోబోతుండడం నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. ఇటువంటి ఓ క్రేజీ కాంబో తెరపై కనిపిస్తే బాక్స్ ఆఫీసు బద్దలే, రికార్డు మోతలే అంటున్నారు ఫ్యాన్స్. అయితే ఈ సినిమా గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

కాగా ప్రస్తుతం  నాని హీరోగా  టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ దర్శకత్వంలో శ్యామ్ సింగ్ రాయ్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి, కృతి శెట్టి  హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
ఇక కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్  శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెలుగు సినిమాకు  సైన్‌ చేసిన విషయం తెలిసిందే. ఇదే తెలుగు లో ధనుష్ మొదటి సినిమా కాగా ఇపుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో నానీ తో కలిసి మల్టీస్టారర్ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: