ఆమె ప్రపంచాన్ని చుట్టి రావాలనుకున్నారు. అదికూడా నడుచుకుంటూ.. పైగా ఒంటరిగా.. అనుకున్నదే ఆలస్యం ఒక రోజు ప్రపంచ యాత్రకు బయలుదేరారు ఎంతో సాహసం ఉన్న ఓ మహిళ.. అలా ఆరు సంవత్సరాలలో 32 వేల కిలోమీటర్లు నడిచి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.  ఎలాంటి వ్యక్తిగత సమస్యలు, భయాందోళనలు, పరాజయం అవుతామనే భావన ఆమెలో లేవు కాబట్టే ఈ రికార్డు సాధించింది అని చెప్పవచ్చు. ఆమె మనసులో లక్ష్యాన్ని ఛేదించాలి అనే లక్ష్యం తప్ప మరే ఆలోచన రాలేదు.

ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా ఏంజెలా మాక్స్ వెల్. ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలుపెట్టారు అనుకున్నప్పుడు నా వయసు 30. చిన్న వయసులోనే అంత పెద్ద లక్ష్యాన్ని ఏర్పరుచుకు న్న 2013లో ప్రపంచాన్ని చుట్టి రావాలని లక్ష్యాన్ని ఏర్పరచుకొని బయలుదేరారు. మొదటినుంచి అభ్యుదయ భావాలు కలిగిన ఈమె ప్రపంచంతో, ప్రకృతితో మమేకం కావాలని అనుకునేది. ఆర్ట్ క్లాస్ కి వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి ప్రపంచాన్ని చుట్టి వచ్చారు అన్న విషయం విని తాను కూడా అలా కూడా చేయాలని భావించింది. 

అనుకోగానే తన లక్ష్యాన్ని ఛేదించే పనిలో పడింది ఏంజెలా. కాలినడకన ప్రపంచాన్ని చుట్టి రావాలని నిర్ణయం తీసుకున్న తర్వాత తన ఇంట్లో సామాన్లు అన్ని అమ్మేసి ప్రయాణానికి అవసరమైన వస్తువులను సమకూర్చుకున్నారు. ఆమె క్యాంపింగ్ కు అవసరమైన పరికరాలు, డీహైడ్రేట్ ఆహారం,మిలిటరీ గ్రేడ్ వాటర్ ఫిల్టర్, నాలుగు కాలాలకు అవసరమైన దుస్తులు మొత్తం 50 కేజీల తన కార్ట్ ను సిద్ధం చేసుకున్నారు. తన ప్రయాణంలో ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఖండాలు దేశాలు తిరిగి ఇప్పటికీ ప్రయాణం కొనసాగిస్తున్నారు.  ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ ప్రణాళిక లేకపోతే సాహసం లో అనిపిస్తుంది ఉంటే ఏదైనా సునాయాసంగా చేయొచ్చు అని నిరూపిస్తూ ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది ఏంజెలా  మ్యాక్స్ వెల్.

మరింత సమాచారం తెలుసుకోండి: