
టాలీవుడ్ లో హీరోయిన్ నిలదొక్కుకోవాలంటే కెరియర్ మొదట్లో చేసే తొలి 2,3 సినిమాలతో హిట్ కొట్టాలి. లేదంటే ఆ హీరోయిన్ స్టార్ హీరోయిన్ అవడానికి ఏమాత్రం అర్హురాలు కాదు అన్నట్లే లెక్క. ఆ విధంగా ఇప్పటి వరకు చాలా మంది టాప్ హీరోయిన్ గా ఉన్న హీరోయిన్ లు తొలి సినిమాతోనో, రెండో సినిమాతోనో, మూడో సినిమాతోనో హిట్ కొట్టి ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అలా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ కి ఏ మాయ చేసావే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సమంత తొలి సినిమాతోనే సూపర్ హిట్ సాధించి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత వరుస హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయ్యింది. హీరోయిన్ అనుష్క నటించిన తొలి రెండు చిత్రాలతో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా మూడవ చిత్రం విక్రమార్కుడు తో ప్రేక్షకులను అలరించింది ఆ సినిమాతో పరిశ్రమలో నిలదొక్కుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
ఆ తర్వాత లక్ష్మీకళ్యాణం సినిమాతో కాజల్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి పెద్దగా ఆకట్టుకోలేకపోయినా రాజమౌళి మగధీర సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో నిలబడి పోయారు. 2005లో వెండితెరకు పరిచయమైన తమన్నాకు సక్సెస్ దక్కడానికి రెండేళ్లు పట్టింది. హ్యాపీడేస్ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించి హిట్టు కొట్టి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కీర్తి సురేష్ తొలి చిత్రం నేను శైలజ తోనే హిట్ కొట్టి ఆ తరువాత మహానటి, నేనులోకల్ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్గా మారింది. రకుల్ ప్రీత్ సింగ్ విడుదలైన తొలి సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తోనే హిట్ కొట్టింది. రష్మిక పూజా హెగ్డే శృతిహాసన్ సాయి పల్లవి హీరోయిన్ ల అతి తక్కువ సినిమాలతోనే సూపర్ హిట్ ను దక్కించుకుని ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.