
తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో ఒకరు ఎస్.వి.రంగారావు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి పెద్ద పెద్ద స్టార్లతో కలిసి నటించిన ఆయన కూడా స్టార్ నటుడిగా ఎదిగాడు. అప్పట్లో విలన్ పాత్రలకు, కేరక్టర్ ఆర్టిస్టులకు పెట్టింది పేరుగా నిలిచారు. ఎస్.వి.రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు కాగా ఆయన దర్శకుడు, రచయిత కూడా. ఆయన కొద్ది రోజులు మద్రాసులో ఆ తర్వాత ఏలూరు విశాఖపట్నంలో చదువుకున్నారు.
తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో మొత్తంగా 300 చిత్రాలకు పైగా నటించారు రంగారావు. రావణుడు హిరణ్యకశిపుడు ఘటోత్కచుడు కంసుడు కీచకుడు నరకాసురుడు మాంత్రికుడు వంటి ప్రతినాయక పాత్ర లలోనే కాకుండా అనేక సహాయ పాత్రలలో నటించి తనదైన ముద్రవేశారు. పాతాళభైరవి, మాయాబజార్, నర్తనశాల వంటి సినిమాల్లో ఆయన ప్రముఖ పాత్ర పోషించగా వీటి ద్వారా ఆయనకు నటుడిగా గుర్తింపు వచ్చింది. పాతాళ భైరవి, మాయ బజార్ నర్తనశాల వంటి చిత్రాలతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందగా ఎస్వీ రంగారావు తెలుగు సినిమా పరిశ్రమకు దొరికిన ఆణిముత్యాలలో లో ఒకరు.
నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి బహుమతి, ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్ బహుమతి కూడా అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన మొదటిచిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది బహుమతులు అందుకున్నాయి. ఇకపోతే ఆయనకు విజయ, ప్రమీల, కోటేశ్వరరావు అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొడుకు కోటేశ్వరరావు సినిమాల్లోకి తీసుకురావాలని చాలా ప్రయత్నించారు. ఒక సినిమా చిత్రీకరణ కూడా ప్రారంభించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కొనసాగలేదు. మొదటి సినిమా వైఫల్యం తర్వాత మళ్లీ అవకాశాలు దొరకకపోవడంతో సినిమా రంగం మీద ఆశలు వదిలేసుకున్న రంగారావు జంషెడ్పూర్ లో టాటా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఇదే సమయంలో అతని మేనమామ కుమార్తె లీలావతి ని వివాహం చేసుకున్నారు.