సినిమా కథ నచ్చి మమ్ముట్టి సినిమాకు ఓకే చెప్పారట. అయితే ఈ సినిమాలో ఆయన నటించేందుకు గాను 3 కోట్ల దాకా డిమాండ్ చేశారని తెలుస్తుంది. సీనియర్ స్టార్ గా మమ్ముట్టి ఇంకా చాలా తక్కువే డిమాండ్ చేశారని చెప్పాలి. అయినా సరే ఆయన అడిగినంత ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు ఓకే అన్నారట. అఖిల్ ఏజెంట్ లో మమ్ముట్టి రోల్ దాదాపు కన్ ఫర్మ్ అన్నట్టే. సినిమాలో ఆయన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు.
అఖిల్ కూడా ఏజెంట్ మీద చాలా కాన్ ఫిడెంట్ గా ఉంటున్నాడు. సినిమాలో అఖిల్ మాస్ లుక్ తో అదరగొడతాడని తెలుస్తుంది. అఖిల్ నాలుగు సినిమాల్లో చూడని కొత్త లుక్ లో.. డిఫరెంట్ స్టైల్ లో ఈ సినిమాలో కనిపిస్తారని తెలుస్తుంది. సినిమాలో అఖిల్, మమ్ముట్టిల సీన్స్ కూడా చాలా బాగా ఉంటాయని చెబుతున్నారు. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర నిర్మిస్తున్న ఏజెంట్ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. డిసెంబర్ 24న సినిమా రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ మరి అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. సైరా సినిమా తర్వాత సురేందర్ రెడ్డి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి