
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు జోరు టాలీవుడ్ లో రోజురోజుకు ఎక్కువైపోతుంది. అందరు హీరోలు ఇతర సినిమాల్లో చేసి దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకోవాలని అనుకుంటున్నారు. బాహుబలి సినిమా తరహా సినిమాలకు నాంది పలుకగా ఆ తర్వాత విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ లు సినిమాలు వరుసగా చేస్తూ దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. గతంలో ఒక భాష చిత్రాన్ని మరో భాషలోకి అనువదించే వారి కానీ ఇప్పుడు అన్ని భాషల్లో ఒకే హీరో నటిస్తూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.

ఆ విధంగా గతంలో చాలామంది టాలీవుడ్ హీరోలు హీరోయిన్లు బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సక్సెస్ కాక మళ్ళీ టాలీవుడ్ లోనే హీరోలుగా హీరోయిన్ లుగా కొనసాగారు అలాంటి వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్లో ఆజ్ కా గూండారాజ్, జెంటిల్మెన్ అనే సినిమాలలు చేశాడు. కానీ అనుకున్న స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్ లోనే కొనసాగారు. విక్టరీ వెంకటేష్ తక్దీర్ వాలా, అనారి సినిమాలతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అక్కడ విజయాన్ని సాధించలేకపోయాడు. ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు.

కన్నడ స్టార్ హీరో సుదీప్ ఈగ సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు పొందాడు. అదే ఊపులో పూంక్, రణ్ అనే బాలీవుడ్ సినిమాలలో నటించాడు కానీ అవి హిట్ కొట్టలేదు. సాట్ రంగ్ కే సప్నే, రాజా కో రాణి సే ప్యార్ హోగ యా సినిమాల్లో నటించి అరవిందస్వామి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కూడా అవి సక్సెస్ కొట్టలేదు. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాతో అయ్యా సినిమా తో ఫ్లాప్ కొట్టి మళ్ళీ బాలీవుడ్ జోలికి వెళ్ళలేదు. త్రిష, శృతిహాసన్, రామ్ చరణ్, తమన్నా, భూమిక వంటి నటీనటులు కూడా బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా అక్కడ ఫెయిల్ అయ్యారు.