
టాలీవుడ్ లో ఈవీవీ సత్యనారాయణ డైరెక్టర్ గా తనదైన ముద్రను వేసుకున్నాడు. జంధ్యాల తర్వాత ఆ రేంజ్ లో కామెడీ చిత్రాలను తెరకెక్కించగల దర్శకుడు అనిపించుకున్నాడు. కమర్షియల్ చిత్రాలను లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను కూడా తనదైన స్టైల్లో తెరకెక్కించి తాను అన్ని రకాల సినిమాలు చేయాలని నిరూపించుకున్నాడు. డైరెక్టర్ గా ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేసిన ఈవీవీ సత్యనారాయణ తన వారసులుగా ఇద్దరు కుమారులు ను టాలీవుడ్ కి హీరోలుగా పరిచయం చేశాడు. ఒక హీరో అల్లరి నరేష్ కాగా మరొక హీరో ఆర్యన్ రాజేష్.
కామెడీ హీరోగా నిలదొక్కుకున్న అల్లరి నరేష్ ఇంకా హీరోగా కొనసాగుతూ హిట్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నాడు. ఇటీవలే నాంది అనే ప్రయోగాత్మక చిత్రం చేసి తాను కూడా తండ్రిని లాగానే అన్ని రకాల జోనర్ ల సినిమాలు చేస్తానని నిరూపించుకున్నాడు. ఇకపోతే ఈ వి సత్యనారాయణ పెద్దకొడుకు ఆర్యన్ రాజేష్ సినిమాలలోకి వచ్చి కొన్ని సినిమాలు చేసి అవి సక్సెస్ కాక సినిమాలు చేయడం ఆపేసి బిజినెస్ పనులు చూసుకుంటున్నాడు. ఆ మధ్య రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ చిత్రంలో హీరో అన్న పాత్రలో నటించి మళ్లీ తన రీ ఎంట్రీ ఇచ్చాడు.
దాంతో ఆర్యన్ రాజేష్ ఇక వరుస సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తాడు అనుకున్నారు కానీ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఆయన సినిమా జీవితం అందరికి తెలిసినా వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ తెలియదు. సుభాషిని అనే అమ్మాయి నీ పెళ్లి చేసుకున్నారు ఆర్యన్. మొదట ఫోటోలో చూసి ఆమెను రిజెక్ట్ చేయగా ఇవివి సత్యనారాయణ డైరెక్టర్ గా చూస్తే తప్పకుండా నచ్చుతుంది అని ఆమెను హైదరాబాద్ కి పిలిపించి పెళ్ళిచూపులు ఏర్పాటు చేశాడు. అక్కడ ఆమెను చూసిన ఆర్యన్ రాజేష్ నచ్చిందని చెప్పి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2012లో వీరి వివాహం జరగగా ఆమెకు తన భర్త నటించిన అన్ని సినిమాలు నచ్చుతాయనీ లీలామహల్ సెంటర్ సినిమా చాలా సార్లు చూసినట్లు తెలిపింది. వీరికి ఓ కొడుకు కూడా పుట్టాడు.