టాలీవుడ్ మ్యాచో స్టార్ ప్రస్తుతం సిటీ మార్
సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ
సినిమా పై గోపీచంద్ అభిమానులు ఎఎన్నో అంచనాలు పెట్టుకోగా ఈ
సినిమా హిట్ తప్పనిసరి అయ్యింది గోపీచంద్ కి. గత కొన్ని సినిమాలుగా గోపీచంద్ అసలు ప్రేక్షకులను మెప్పించడం లేదు యాక్షన్ హీరోగా ఎన్నో సూపర్ డూపర్ హిట్ లు చేసిన గోపీచంద్ అన్ని ఫ్లాప్
సినిమా లు చేయడంతో ఆయన అభిమానులు ఎంతో కలవరపడ్డారు. దాంతో తనకు ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో హిట్ కొట్టడం కోసం మరొకసారి ప్రయోగం చేస్తున్నారు.
కబడ్డీ ఆట నేపథ్యంలో కొనసాగుతున్న ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా కనిపిస్తుండగా
తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు.
మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే ఈ
సినిమా నుంచి విడుదలైన జ్వాలా
రెడ్డి అనే పాట సూపర్ డూపర్ హిట్ అయ్యింది. హిట్ కొట్టి ఏడేళ్లయినా కూడా ఈ సినిమాకి గోపీచంద్ కి ఏ మాత్రం క్రేజ్ దక్కలేదు. రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. సాహసం లౌక్యం వంటి సినిమాలతో హిట్లు కొట్టిన తర్వాత గోపీచంద్ కు ఇంతవరకు ఆ రేంజ్ లో హిట్ దక్కలేదు.
సంపత్ నంది దర్శకత్వంలో ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన
గౌతమ్ నంద
సినిమా కూడా ప్రేక్షకులను నిరాశ పరిచే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. ఇక ఈ
సినిమా షూటింగ్ కూడా ఎప్పటినుంచో జరుగుతూ రాగా డిజిటల్ రిలీజ్ కి నో చెప్పి
థియేటర్ రిలీజ్ కి ఎదురు చూశారు. సెకండ్ వేవ్ వలన వెనక్కి తగ్గిన సినిమాలలో ఒకటి ఈ
సినిమా కూడా.
సినిమా బడ్జెట్ బిజినెస్ లాంటివి పట్టించుకోకుండా టోటల్ అన్ని రైట్స్ నీ ఏకంగా ఇరవై ఆరు కోట్ల రేటుకు సింగిల్ పేమెంట్ తో సొంతం చేసుకో తుంది జీ సంస్థ అని అంటున్నారు. ఈ బిజినెస్ చూస్తుంటే గోపీచంద్ రేంజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు చెప్పొచ్చు.