ప్రస్తుతం పెద్ద సినిమాల విడుదలలు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు నిర్మాతలు. భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మితం కావడం వలన ఆ సినిమాకు ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ ఆంక్షల పరంగా నష్టాలు వస్తాయన్న భయంతో వారు విడుదల చేయడం లేదు. ప్రభుత్వాలు థియేటర్లను ఓపెన్ చేసుకోవడానికి ఎప్పుడో పర్మిషన్ ఇచ్చిన కూడా సినిమాలు విడుదల కావటం లేదు అందుకు కారణం యాభై శాతం ఆక్యుపెన్సీ ఉండటం ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో రాడో అన్న అనుమానం కలగడం వల్ల వారు సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి ఆలోచిస్తున్నారు.

ప్రస్తుతం విడుదల కావడానికి మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, నాగచైతన్య లవ్ స్టోరీ , వెంకటేష్ నారప్ప,  విరాటపర్వం,  పవన్ కళ్యాణ్ అయ్యప్పానుం కోషియం రీమేక్, బాలకృష్ణ అఖండ వంటి చాలా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇవన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కావడంతో 50% ఆక్యుపెన్సీ తో ఇప్పుడు విడుదల చేస్తే ఆ సినిమాలకు నష్టాలు చేయడం ఖాయమని వారు తమ రిలీజ్ డేట్ ముందుకు పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. ఆ విధంగా చాలా మంది తమ సినిమాలను సంక్రాంతి కి విడుదల చేసే ఆలోచన చేస్తున్నారు.

ఇన్ని పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అంటే అది సినీ పరిశ్రమకే పెద్ద నష్టం వాటిల్లుతుంది. అన్ని సినిమాలు ఒకే సారి ఒకే సీజన్లో విడుదల కావడం వలన అన్ని సినిమాలకు ప్రేక్షకులు వెళ్లకుండా ఉండడంతోపాటు సినిమాలకు కొంత లాభం మాత్రమే చేకూరే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొంతమంది దసరాకు ఇంకొంతమంది దీపావళికి మరి కొంతమంది క్రిస్మస్ కు ఆ తర్వాత సంక్రాంతి ఇలా విభజించుకుని తమ సినిమాలను విడుదల చేస్తే అందరికీ మంచిదని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ సీజన్లో ఏ హీరోకి కలిసి వస్తుందో చూసుకొని ఆ హీరోలు తమ సినిమాలను విడుదల చేయాలని చూసుకుంటున్నారట. మరి ఈ సంక్షోభం నుండి సినిమా ఇండస్ట్రీ ని కాపాడే సినిమా ఏదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: