రాజశేఖర్, రోజా, గౌతమి హీరో హీరోయిన్ లుగా నటించిన సినిమా అన్న. పోకూరి బాబురావు నిర్మాణంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ హిట్ అయ్యింది. రాజశేఖర్ ను సరికొత్త కోణంలో చూపించిన ఈ సినిమా అందరికీ ఎంతో మంచి పేరు తీసుకురాగా ఇందులో బాలనటుడిగా చేసిన ఓ పాత్ర ఎంతో స్పెషల్ గా నిలిచింది. ఈ సినిమా విశేషాలు ముత్యాల సుబ్బయ్య ఇటీవలే వెల్లడించారు. 

పెళ్లిగోల సినిమా పూర్తి కాగానే అన్న సినిమా చేసినట్లు ఆయన చెప్పారు. మాస్టర్ బాలాదిత్య ను బాల నటుడిగా ఎంపిక చేసిన తరువాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని చెప్పారు. అయితే ఈ సినిమా షూటింగుకు రాజశేఖర్ రోజు లేటుగా వచ్చేవాడు. హెల్త్ ప్రాబ్లం అని చెప్పడంతో ఏమీ అనలేక పోయేవాళ్ళం. పొద్దున్నే షూటింగ్ స్పాట్ కు వెళ్లి రాజశేఖర్ లేని సీన్లు తీసేసి ఆ తర్వాత అతను ఎప్పుడూ వస్తాడని ఎదురు చూసేవాళ్లం. రాజశేఖర్ కారణంగానే ఈ సినిమాకు ఎక్కువ రోజులు పని చేయాల్సి వచ్చింది. వంద రోజులకు పైగా ఆ సినిమాకు పని చేశాను.

మరో విషయం ఏమిటంటే రాజశేఖర్ ఆ సమయంలోనే కెఎస్ రామారావు గారి అంగరక్షకుడు సినిమాలో నటిస్తూ ఉండేవాడు. మలయాళ దర్శకుడు జోషి దర్శకుడు గా పని చేస్తున్నారు. కారణాలు తెలియవు కానీ ఆ చిత్రానికి రాజశేఖర్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వాడు. అని చెప్పారు.  ఇక బాల నటుడి విషయంలో నిర్మాతకు నాకు చిన్న ఇష్యూ నడిచింది. అదేంటంటే ఈ సినిమాలో బాలనటుడిగా ఎర్రమందారం చిత్రం లో రాజేంద్ర ప్రసాద్ కొడుకు గా నటించిన బాల నటుడిని తీసుకుంటామన్నారు నిర్మాత పోకూరి బాబూరావు. కానీ రాజశేఖర్ తమ్ముడు గా మాస్టర్ బాలదిత్య ను తీసుకోవాలని నేను పట్టు పట్టాను. చివరికి నా మాటే నెగ్గింది. 

  

మరింత సమాచారం తెలుసుకోండి: