టాలీవుడ్ లో స్టార్ హీరోలు గా ఉన్నారు మెగా పవర్స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మెగా వారసుడు గా రామ్ చరణ్ నందమూరి వారసుడు గా ఎన్టీఆర్ ఇద్దరూ దాదాపు ఒకే సమయంలో తమ కెరీర్ ను ప్రారంభించి ఇప్పుడు టాప్ హీరోలుగా ఎదిగారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ అనే మల్టీ స్టారర్ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు.  ఇప్పటికే ఈ రెండు పాత్రలకు సంబంధించిన టీజర్ లు విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది.

ఇక  ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసి సినిమాపై అంచనాలను భారీగా పెంచాడు జక్కన్న. ఇద్దరు టాలీవుడ్ సూపర్ స్టార్ లతో కలిసి రాజమౌళి లాంటి పాన్ ఇండియా డైరెక్టర్ తెరకెక్కించబోతున్న ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరూ కలిసి బుల్లి తెరపై కనిపిస్తుండటం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ జెమినీ టీవీలో  ఎవరు మీలో కోటీశ్వరుడు అనే ప్రోగ్రాం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ షో ఎప్పుడు మొదలు కావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో ఆగిపోయింది. 

ప్రస్తుతం పరిస్థితులు అన్నీ నార్మల్ అయిన నేపథ్యంలో ఈ షో షూటింగ్ మొదలు పెట్టనున్నారు ఛానల్ నిర్వాహకులు. ఈ నేపథ్యంలోనే ఈ షోకు మరింత బజ్ రావాలంటే ఎన్టీఆర్ తో పాటు ఆర్ఆర్అర్ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ ని కూడా మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ గా తీసుకురావాలని భావించి ఆయనను సంప్రదించగా ఎన్టీఆర్ తో బుల్లితెర పంచుకోవడానికి రామ్ చరణ్ ఒప్పుకున్నట్లు సమాచారం. వెండితెరమద ఆలరించడాని కంటే ముందే వీరిద్దరూ ఈ షో ద్వారా ప్రేక్షకులను అలరించబోతున్నారు అన్నమాట. ఇకపోతే అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం వీరిద్దరూ బుల్లితెరపై కలిసి నటించబోతున్నారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: