టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అక్కినేని వారసుడిగా నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ సినిమా రంగ ప్రవేశం చేసి తమ తమ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కినేని నాగచైతన్య జోష్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత ఏ మాయ చేసావే చిత్రంతో సూపర్ హిట్ అందుకొని వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. 

ప్రస్తుతం ఆయన హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా త్వరలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమానే కాకుండా థాంక్యూ అనే చిత్రంలో కూడా నాగ చైతన్య నటిస్తున్నాడు. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా ఈ సినిమా కొద్ది వ్యవధిలోనే విడుదల అవుతుండటం గమనార్హం. ఈ రెండు సినిమాలు దసరా తర్వాత నెల రోజుల గ్యాప్ తో విడుదల కాబోతున్నాయి.

ఇక అక్కినేని అఖిల్ తన తొలి హిట్ సాధించడానికి వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఆయన తన నాలుగో సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ వాంటెడ్ బ్యాచ్ లర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా దసరా తర్వాత విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.   ఈ నేపథ్యంలో లో ఈ అన్నదమ్ములు ఒకే సీజన్ లో సినిమాలను విడుదల చేస్తుండడంతో అక్కినేని వారు ఈ ద్వితీయార్థంలో సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కినేని అఖిల్ ఈ సినిమానే కాకుండా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమాను కూడా ఇటీవలే మొదలుపెట్టాడు. ఈ సినిమా ను వచ్చే సంవత్సరం విడుదల చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: