రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తాను హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా విడుదల కాకముందే ఆయన పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సలార్ సినిమా మొదలుపెట్టి చివరిదశ షూటింగ్ కు తీసుకు వచ్చాడు. ఈ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఓవైపు కేజిఎఫ్ రెండవ భాగం పూర్తి చేస్తూనే ఈ సినిమాని కూడా ప్రశాంత్ నీల్ పూర్తి చేసి  ఫుల్ ఫాస్ట్ గా దూసుకుపోతున్నాడు.

ఇక ప్రభాస్ ఈ సినిమాల తర్వాత చేయాల్సిన సినిమాల లిస్టు రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తరువాత బాలీవుడ్ ఎంట్రీ చేస్తున్న ఆదిపురుష్ సినిమా యొక్క షూటింగ్ చేయనున్నాడు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రం కూడా లైన్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల తరువాత ప్రభాస్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడని టాలీవుడ్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది.  త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా తర్వాత ప్రభాస్ తో చేతులు కలిపబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. 

అయితే ఇది సాధ్యమేనా అని మరికొంతమంది
 వాదనలు చేస్తున్నారు. ప్రభాస్ సినిమాలు ఒప్పుకున్నవి కంప్లీట్ అయ్యేసరికి 2024 అయినా అవుతుంది. త్రివిక్రమ్ మహేష్ తో సినిమా 2022లో పూర్తి చేశాక మరో రెండు సంవత్సరాలు ఖాళీగా ఉండటం అంటే అసాధ్యమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రభాస్ లాంటి స్టార్ హీరో కోసం త్రివిక్రమ్ లాంటి అగ్ర దర్శకుడు వేచి చూస్తాడా అనేది చూడాలి. కొత్త దర్శకుడో, హిట్ కోసం వేచిచూస్తున్న దర్శకుడో అయితే ప్రభాస్ కోసం వెయిట్ చేసే వాడే కానీ స్టార్ హీరోలందరూ త్రివిక్రమ్ తో మళ్లీ మళ్లీ సినిమా లు చేయాలనుకునే దర్శకుడు కావడంతో ప్రభాస్ కోసం త్రివిక్రమ్ అన్ని రోజులు వెయిట్ చేయడం అసాధ్యం. 

మరింత సమాచారం తెలుసుకోండి: