టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తుంది. అది ఏమిటంటే ఆస్కార్ అవార్డు పొంది, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఏ ఆర్ రెహమాన్ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ కామెంట్స్ చేసి ఒక్కసారిగా సెన్సేషన్ సృష్టించాడు. ఏ నార్మల్ మ్యూజిక్ డైరెక్టర్ తెలియదు అనుకుంటే పర్వాలేదు కానీ ఆస్కార్ అవార్డు పొంది ఇండియా పేరు ను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ను ఎవరో తెలియదు అని చెప్పడంతో ఒక్కసారిగా బాలయ్య ఎంతోమంది విరుచుకుపడుతున్నారు. 

టాలీవుడ్ లో స్టార్ హీరో గా ఉన్న బాలకృష్ణ కు రెహమాన్ తెలియదు అనడంలో ఎంతటి అర్థం ఉందో తెలుసుకోవచ్చు అని రెహ్మాన్ అభిమానులు అంటున్నారు. ఇది కేవలం రెహా మాన్ ను అవమానించడానికి బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. ఏదేమైనా టాలీవుడ్ సినీ పెద్దలు కూడా బాలకృష్ణ ఇలా అనవలసి ఉండాల్సింది కాదు అంటున్నారు. గతంలో చాలా సార్లు తనకు కొంతమంది తెలియదన్నట్లు మాట్లాడి వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పుడు ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో చూడాలి. 

ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మాస్ మసాలా సినిమా చేయనున్నాడు. అఖండ సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఏ ఆర్ రెహమాన్ తో బాలకృష్ణ ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయకపోవడం గమనార్హం.గతంలో ఒకటి రెండు సార్లు గతంలో ప్రయతించిన కొన్ని కారణాల దృష్ట్యా ఈ కాంబో వర్కౌట్ అవలేదు.  మరి దేన్నీ ఉద్దేశించి బాలకృష్ణ ఏ ఆర్ రెహమాన్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారో తెలుసుకోవాలంటే బాలయ్య నోరు విప్పాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: