ఒకప్పుడు బుల్లితెర అంటే డబ్బులు ఎక్కువ సంపాదించని విధంగా ఉంటుంది అని అనుకునేవారు. కానీ ఇప్పుడు అదే బుల్లితెర వెండితెర కంటే ఎక్కువగా డబ్బులు సంపాదించే వేదికగా మారింది. ముఖ్యంగా బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ ఎంతో మంది యాంకర్ లు జీవితంలో సెటిల్ అయిపోయారు. మంచి సమయస్ఫూర్తితో మాట్లాడడం, పంచ్ డైలాగులు వేయడం, ఆకట్టుకునే తత్వం ఉంటే యాంకర్ గా రాణించవచ్చు. ఫిమేల్ యాంకర్స్ కంటే మేల్ యాంకర్ లు ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా కష్టం అని చెప్పవచ్చు. ఆ విధంగా మేల్ యాంకర్స్ కొందరు ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ బుల్లితెర పై కనిపిస్తూ కోట్లాది రూపాయలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు వారెవరో ఇప్పుడు చూద్దాం. 

ప్రస్తుతానికి బుల్లితెరపై మేల్ యాంకర్లలో టాప్ యాంకర్ గా కొనసాగుతున్నాడు ప్రదీప్ మాచిరాజు. పలు షోలకు యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరించడంలో నెంబర్ వన్ యాంకర్ గా దూసుకుపోతున్నాడు. ఈయన ఇటీవలే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా చేశాడు. ఒక్కొక్క శివ కి గాను ఆయన మూడు లక్షల దాకా పారితోషికం తీసుకుంటారట. ఏదైనా సినిమా ఫంక్షన్లకు యాంకరింగ్ చేయాల్సి వస్తే దానికి 5 లక్షల దాకా తీసుకుంటారని సమాచారం. సినిమా హీరో గా చేసినందుకుగాను ఆయన 30 లక్షల పారితోషికం తీసుకుంటారు.  మొత్తం మీద ఆయనకు 10 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది.

ఇక టాలీవుడ్ లో మేల్ యాంకర్ లలో రెండవ స్థానంలో  ఉన్నాడు యాంకర్ రవి. ఓవైపు షోలతో బిజీగా ఉంటూనే సినిమా ఫంక్షన్స్ కు కూడా యాంకరింగ్ చేస్తాడు అంతేకాదు హీరోగా కూడా, నటుడిగా కూడా చేస్తాడు. ఆయన నెలకు ఇరవై లక్షల పారితోషికాన్ని తీసుకుంటారట. బంజారా హిల్స్ లో  ఖరీదైన ఫ్లాట్ తో సహా ఐదు కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఇక నటుడిగా బుల్లితెరపై పరిచయం అయి యాంకర్ గా మారాడు సుధీర్. ఈయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షో లలో చేస్తున్నాడు.  సినిమా ఫంక్షన్ లకు, షో లకు దాదాపు రెండు లక్షల వరకు పారితోషకాన్ని అందుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: