ఆన్‌లైన్ యాప్ ల ద్వారా అడల్ట్ చిత్రాలను చిత్రీకరించడంలో పాల్గొన్నారనే ఆరోపణలతో రాజ్ కుంద్రాను సోమవారం రాత్రి ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. కొనసాగుతున్న ఈ కేసులో కీలక కీలక నిందితుడిగా భావించిన రాజ్‌ కుంద్రాను మంగళవారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు ఆయనను జూలై 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఈ నేపథ్యంలో ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నటి, మోడల్ ఇచ్చిన ఓపెన్ స్టేట్మెంట్ సంచలనంగా మారింది. నటి షెర్లిన్ చోప్రా రాజ్ కుంద్రా కేసుతో తనకు ఉన్న సంబంధంపై ఓపెన్ అయ్యారు. ఈ కేసులో మహారాష్ట్ర సైబర్ సెల్ దర్యాప్తు బృందానికి స్టేట్మెంట్ ఇచ్చిన మొదటి వ్యక్తిని తానేనేని షెర్లిన్ అన్నారు.

షెర్లిన్ గురువారం ట్విట్టర్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. అందులో “గత కొన్ని రోజులుగా చాలా మంది జర్నలిస్టులు, మీడియా వ్యక్తులు నన్ను పిలుస్తున్నారు. నాకు ఇమెయిల్ చేస్తున్నారు. ఈ అంశంపై నేను ఏమి అనుకుంటున్నానో తెలుసుకోవడానికి నాకు టెక్స్ట్ చేస్తున్నారు. మహారాష్ట్ర సైబర్ సెల్ దర్యాప్తు బృందానికి స్టేట్మెంట్ ఇచ్చిన మొదటి వ్యక్తిని నేనే అని మీ అందరికీ తెలపాలని అనుకుంటున్నాను. ఆర్మ్స్‌ప్రైమ్ గురించి వారితో సమాచారాన్ని పంచుకున్న మొదటి వ్యక్తి కూడా నేనే. మహారాష్ట్ర సైబర్ సెల్ నాకు సమన్లు పంపినప్పుడు నాకు శిల్పా, ఆమె పిల్లలు గుర్తొచ్చారు అని ఎమోషనల్ డైలాగులు చెప్పే ఇతరుల మాదిరిగా కాకుండా... నేను పాతాళంలోకి వెళ్ళలేదు. తప్పిపోలేదు. ఈ నగరం లేదా దేశం నుండి పారిపోవడానికి ప్రయత్నించలేదు. మార్చి 2021 లో నేను సైబర్ సెల్ కార్యాలయానికి వెళ్లి నా స్టేట్మెంట్ వారికి ఇచ్చాను. మిత్రులారా ఈ అంశంపై చాలా విషయాలు చెప్పాలి. కాని ఈ విషయంపై కేసు విచారణలో ఉంది కాబట్టి దీనిపై వ్యాఖ్యానించడం సరికాదు. దయచేసి మహారాష్ట్ర సైబర్ సెల్‌తో సంప్రదించి, మీ ప్రశ్నలను వారి ముందు ఉంచాలని మీ అందరినీ, ముఖ్యంగా జర్నలిస్టులను నేను అభ్యర్థిస్తున్నాను. నా స్టేట్మెంట్ నుండి కొన్ని విషయాలను వెల్లడించమని మీరు వారిని అభ్యర్థించవచ్చు" అంటూ డైరెక్ట్ ఏం జరిగింది అనే విషయాన్నీ పూసగుచ్చినట్టు వెల్లడించింది షెర్లిన్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: