పోర్న్ వీడియోలు నిర్మిస్తున్నారనే ఆరోపణలపై ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోల వ్యవహారంలో రాజ్‌కుంద్రా భార్య శిల్పాశెట్టి పాత్ర ఉందా అనే కోణంలో క్రైమ్ బ్రాంచ్ అధికారులు శుక్రవారం రోజు విచారించారు. ఈ మేరకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్‌కుంద్రాతో కలిసి శిల్పాశెట్టి ఇంటికి చేరుకున్నారు. అయితే వారిని చూడగానే శిల్పా శెట్టి కన్నీటిపర్యంతమయ్యారు. రాజ్‌కుంద్రాతో పాటు ఇంకో నిందితుడిపై కూడా ఆమె గట్టి గట్టిగా అరిచారు. దీంతో క్రైమ్ బ్రాంచ్ అధికారులు విస్తుపోయారు. హాట్ షాట్ పోర్న్ అప్లికేషన్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆమె తన భర్త రాజ్‌కుంద్రాతో మాట్లాడారు. తమ ఫ్యామిలీని చాలా నెగిటివ్ కోణంలో చూపిస్తున్నారని ఆమె రాజ్‌కుంద్రాతో చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.


శుక్రవారం రోజు 6 గంటల పాటు కొనసాగిన క్రైమ్ బ్రాంచ్ విచారణలో శిల్పా శెట్టితో రాజ్‌కుంద్రా మాట్లాడారు. తాను చాలా అమాయకుడిని తనకు ఏ పాపం తెలియదని ఆయన శిల్పాశెట్టి తో చెప్పుకొచ్చారు. పోర్న్ వీడియోలను తాను రూపొందించలేదని కేవలం ఇంటెన్స్ రొమాంటిక్ వీడియోలు మాత్రమే రూపొందించానని ఆయన శిల్పాశెట్టి తో చెప్పారు. తన కేసు కోర్టులో నిలబడదని శిల్పా శెట్టి తో ఆయన చెప్పినట్లు సమాచారం.



అయితే శిల్పా శెట్టి ని విచారించిన అనంతరం క్రైమ్ బ్రాంచ్ అధికారి కొన్ని విషయాలు వెల్లడించారు. ఇప్పటివరకూ జరిపిన విచారణలో శిల్పా శెట్టికి పోర్న్ వీడియోలు కేసుతో ఎలాంటి సంబంధం లేదని తెలిసిందని ఆయన అన్నారు. ఈ కారణంగా ఆమెను ఇక ప్రశ్నించబోమని ఆయన స్పష్టం చేశారు. శిల్పాశెట్టి మాత్రం తన భర్త చాలా అమాయకుడని క్రైమ్ బ్రాంచ్ అధికారులతో చెప్పుకొచ్చారు. తన భర్త కేవలం రొమాంటిక్ వీడియోలు మాత్రమే రూపొందించారని ఆమె అన్నారు. శృంగారమైన వీడియోలు వేరే ఓటీటీ వేదికల్లోనూ ఉన్నాయని చెబుతూ.. తన భర్తకు సపోర్ట్ చేయడానికి ఆమె అన్నివిధాలా ప్రయత్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: