సోషల్ మీడియా పుణ్యమా అని ..ఇటీవల ప్రతి ఒక్కరు పాపులర్ అవుతున్నారు. ఇక అందులో భాగంగానే ఆధ్యాత్మిక ప్రవచనాలకు పెట్టింది పేరు గరికపాటి నరసింహారావు. ఇకపోతే ఈయనను అప్పట్లో పెద్ద వాళ్ళు మాత్రమే బాగా గుర్తు పెట్టుకునే వారు   ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆయనకు యూత్ ఫాలోయింగ్ కూడా ఎక్కువైంది. ప్రస్తుతం యువతకు అర్థమయ్యేలా ఉదాహరణలతో సహా చెప్పే , ఈయన ప్రవచనాలు యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ఇక అందులో భాగంగానే ఉదాహరణగా ఆయన ఒక స్టార్ హీరో గురించి చెప్పుకొచ్చిన విధానం , ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఇంతకు ఆ హీరో ఎవరు.. ఈయన ఏం చెప్పారు అనే విషయాలను తెలుసుకుందాం.


ఇక ఇటీవల ఆయనకు ఎదురైన ప్రశ్న ఏమిటంటే.. ఈనాటి యువతరం ఎందుకు పెద్దవాళ్ళతో కలవలేక పోతుంది అని..? అందుకు సమాధానంగా గరికపాటి మాట్లాడుతూ.. కోలీవుడ్ స్టార్ యాక్టర్ అయిన విక్రమ్ ను  ఈ విషయం లోకి లాగాడు. ఇక ఈయన చెప్పిన సమాధానం వింటే ఆయన ఎంతగా సినిమాలను ఫాలో అవుతున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇక ముఖ్యంగా దీనికి సమాధానం ఆయన ఏజ్ గ్రూప్ మాత్రమే తేడా అని చెప్పుకొచ్చాడు..


ఇక విక్రమ్ ఉదాహరణగా చూపిస్తూ.. విక్రమ్ కూడా నటసార్వభౌముడు అయిన కమలహాసన్ లాగే 16 రకాల వేషాలు కూడా వేస్తాడు.అంటే ముసలి,వాడి పాత్రలోనైనా, పడుచు వాడి పాత్రలోనైనా అమాయకుడిగా, రౌడీ గా ఇలా ఎలా కనిపించాలంటే, అలా ఊసరవెల్లిలా తన పాత్రలను మారుస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు అని విక్రమ్ గురించి చెప్పుకొచ్చాడు..

అంతేకాదు విక్రమ్ ఇటీవల నటిస్తోన్న కోబ్రా సినిమా గురించి కూడా చెప్పుకొచ్చాడు. విక్రమ్ కోబ్రా సినిమాలో ఒక రాజకీయ నాయకుడిగా, పారిశ్రామికవేత్తగా, ప్రొఫెసర్ గా, శాస్త్రవేత్తగా ,మత బోధకుడిగా ఇలా పలు రకాల పాత్రల్లో కనిపించబోతున్నాడు.. అని ఆయనే స్వయంగా చెప్పడం ఇక్కడ గమనార్హం.. ఇక ఈ విషయాలన్నీ విన్న నెటిజనులు గరికపాటి మాటలకు శభాష్ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: