వ్యాపారవేత్త రాజ్ కుంద్రా నీలి చిత్రాల నిర్మాణం, యాప్స్ ద్వారా షేరింగ్ వంటి ఆరోపణలతో ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఈ వ్యవహారం బాలీవుడ్ లో రచ్చగా మారింది. జూలై 23న రాజ్ కుంద్రా ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. తాజా విచారణలో కోర్టు ఆయనకు మరో 14 రోజులు జైలుకు పంపింది. ఈ నేపథ్యంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ రాజ్ కుంద్రా కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారం, మీటూ ఉద్యమం బాలీవుడ్ ను కుదిపేసింది. ఇప్పుడు సెక్స్ రాకెట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇల్లీగల్ యాక్టివిటీస్ లో పట్టుబడ్డ సెలబ్రిటీల గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలు షాకింగ్ సర్ప్రైజ్ ఇవ్వొచ్చు మీకు.

షైనీ అహుజా... 2011లో రేప్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. విజయ్ రాజ్.. 2005లో ఓ సినిమా షూటింగ్లో అబుదాబి పోలీసులకు డ్రగ్స్ తో పట్టుబడ్డాడు. శ్వేతా బసు ప్రసాద్... 2014లో ప్రాసిక్యూషన్ రాకెట్ లో చిక్కుకున్న విషయం తెలిసిందే. మందాకిని... అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తో ఎఫైర్ వార్తల్లో నిలిచింది. పాపులర్ టీవీ యాక్టర్ అమన్ వర్మ ఓ స్టింగ్ ఆపరేషన్ లో సెక్సువల్ ఫేవర్ కోసం అడిగి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. శక్తి కపూర్... 2005లో జరిగిన స్టింగ్ ఆపరేషన్ లో ఈ ఫేమస్ యాక్టర్ ఏకంగా రిపోర్టర్ ని సెక్సువల్ ఫేవర్ అడిగాడు. సంజయ్ దత్... 1993లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ అరెస్టైన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఆయన ఇంట్లో ఏకే 56 రైఫిల్ దొరికింది. ఇక సల్మాన్ ఖాన్ కూడా కృష్ణ జింకల్ని వేటాడిన కేసు, అలాగే ఆక్సిడెంట్ కేసు వంటి పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: