"ఫ్యామిలీ మ్యాన్" వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మనోజ్ బాజ్‌పేయి. జాతీయ అవార్డు గ్రహీత అయిన ఆయనను తాజాగా బాలీవుడ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాల మధ్యలోకి లాగాలని ఓ కమెడియన్ చూశాడు. రాజ్ కుంద్రా కేసు బాలీవుడ్ లో సంచలనం రేపుతున్న వేళ ఓటిటి కంటెంట్ పై రచ్చ మొదలైంది. ఓటిటికి సెన్సార్ అనేది లేకపోవడంతో రెచ్చిపోయి న్యూడ్, రొమాంటిక్ సన్నివేశాలను తీస్తున్నారనేది వారి వాదన. సినిమాలకు సెన్సార్ బోర్డు అనేది ఒకటి ఉంది కాబట్టి చాలా వరకు అలాంటి సన్నివేశాలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇదే విషయాన్నీ ప్రస్తావిస్తూ బాలీవుడ్ హాస్యనటుడు సునీల్ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ కామెంట్స్ తో "ఫ్యామిలీ మ్యాన్" అభిమానులను ఇబ్బంది పెట్టాడు.

హాస్యనటుడు మనోజ్ బాజ్‌పేయిని 'బడ్తమీజ్', 'గిరా హువా ఆద్మీ' అంటూ ఫైర్ అయ్యాడు. అంతేనా బాజ్‌పేయిని, అతని తాజా సిరీస్‌ గురించి మాట్లాడుతూ “మనోజ్ బాజ్‌పేయి ఎంత పెద్ద నటుడు ? ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకున్న ఆయన ఇలాంటి సిరీస్ లలో నటించడం సిగ్గుచేటు. అందరికీ స్ఫూర్తిగా ఉండాల్సిన ఆ ఆ వ్యక్తి ఇప్పుడు చేస్తున్న వెబ్ సిరీస్ లలో దారుణమైన సన్నివేశాలు ఉన్నాయి. సెన్సార్ లేకపోవడంతో ఓటిటిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గమైన, అనైతిక వ్యక్తిని నేను ఎన్నడూ చూడలేదు” అని అన్నాడు. "ది ఫ్యామిలీ మ్యాన్ 2" కథాంశంపై, అందులో ప్రియమణి వ్యవహారం, క్యారెక్టర్, వారి కుమార్తె రిలేషన్ ట్రాక్, కొడుకు పాత్రను కూడా విమర్శించాడు.

తాజాగా ఓ మీడియా బాజ్‌పేయిని పాల్ వ్యాఖ్యల గురించి స్పందించమని అడిగారు. దానికి ఆయన నవ్వేసి కొంతమందికి పనేమీ లేదని నాకు అర్థమైంది. కానీ ఈ రకమైన పరిస్థితులలో ప్రజలు ధ్యానం చేయాలి" అని చెప్పుకొచ్చాడు. సమాధానం చెప్పడానికి ముందు "ది ఫ్యామిలీ మ్యాన్ స్టార్" దాదాపు ఒక నిమిషం పాటు నవ్వారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: