చిన్నతనం నుంచి స్నేహం యొక్క విలువ ను, స్నేహితుడి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తే సదరు వ్యక్తి జీవితాంతం ఎంతో సంతోషంగా స్నేహితులతో ఉంటాడు అని చాలాసార్లు నిరూపితమైంది. ఆ విధంగా చిన్నతనం నుండి సితార, అద్య ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. మహేష్ బాబు కూతురు సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్య ఇద్దరు మంచి స్నేహితులుగా కాగా ఇద్దరు కలిసి ఎస్ అండ్ ఎన్ పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు. వీరు చేసే సందడి నీ యూట్యూబ్ లో లక్షల మంది వీక్షిస్తూ ఉంటారు.

కొన్ని కొన్ని ఈవెంట్ల సమయంలో పండగలప్పుడు వీరు చేసే స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఈ ఇద్దరు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. తమ గురించి తమ తల్లిదండ్రుల గురించి తమ స్నేహం గురించి ఎన్నో విషయాలు చెప్పి ప్రేక్షకులను అలరించారు. తొలిసారి వీరు మహర్షి సినిమాకు సంబంధించిన ఓపెనింగ్ సమయంలో కలిశారని అక్కడ పెద్దగా మాట్లాడుకో లేదని ఆ తర్వాత మెల్ల మెల్లగా మా ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ఇంతదూరం వచ్చిందని చెప్పారు. ఓకే స్కూల్ అయినా మహర్షి కంటే ముందు ఎప్పుడూ సితారతో తను మాట్లాడలేదనీ చెప్పడం గమనార్హం. 

మా ఇద్దరికీ ఎక్కువగా గొడవలు రావని అభిప్రాయభేదాలు మాత్రం వస్తూ ఉంటాయని, ఒకవేళ గొడవలు వచ్చినా అది పది నిమిషాలు మాత్రమే ఉంటాయి అని చెప్పుకొచ్చారు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తామని చెప్పినప్పుడు మా పేరెంట్స్ ఇప్పుడే అవన్నీ వద్దు అన్నారు కానీ మేము వారిని ఒప్పించగలిగాము అన్నారు. మేము ఇద్దరం కలిసి లండన్ కి వెళ్ళాము.  అక్కడ మా ఇద్దరికీ మెమొరబుల్ హాలిడే దొరికింది. అక్కడ చాలా షాపింగ్ చేసాము అలాగే ఐటమ్స్ కొన్నాం అని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: