సినిమా వాళ్ళతో ముఖ్యం గా హీరోలతో కుటుంబ సభ్యులు సన్నిహితులు స్నేహితులు మాత్రమే ఎంతో క్లోజ్ గా ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ వారందరినీ మనం ఎక్కడోచోట చూస్తూనే ఉంటాము. కానీ ప్రభాస్ తో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మాత్రం ఎక్కువ మంది చూడలేదు. ప్రభాస్ తో అంత చనువుగా క్లోజ్ గా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ప్రభాస్ అభిమానులు నెట్ లో తెగ సెర్చ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరో కాదు ప్రభాస్ తో పాటు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు వంటి ఎంతో మంది స్టార్ హీరోలు నటనలో శిక్షణ ఇచ్చిన సత్యానంద్ అని తెలిసి ఆశ్చర్య పోతున్నారు.

వీరు మాత్రమే కాకుండా ఎంతో మంది నటులకు ఓనమాలు దిద్దించిన రైటర్ సత్యానంద్ రీసెంట్ గా తన పుట్టినరోజు జరుపుకున్నారు. తనకు నటన నేర్పించి ఇంతట వాడు గా ఎదగడానికి కారణమైన సత్యానంద్ గురువు గారి జన్మదిన సందర్భంగా  ప్రభాస్ ఆయనతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ పుట్టినరోజును ఘనంగా జరిపాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. 

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా సినిమా పరిశ్రమలోకి ప్రవేశించి ఈశ్వర్ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు ప్రభాస్. ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, డార్లింగ్, మిర్చి, బాహుబలి వంటి చిత్రాలతో సూపర్ హిట్ లు అందుకునీ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సెట్స్ మీద ఉన్న నాలుగు చిత్రాలు పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలే. సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ తాజా చిత్రం రాధే శ్యామ్ చిత్రం విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సలార్ మరియు ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే వంటి చిత్రాలు ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: