ఇటీవలి కాలంలో బుల్లితెర కార్యక్రమాలకు రోజురోజుకూ క్రేజ్ సంపాదిస్తున్నాయి. అటు సినిమాలకు మించి ప్రేక్షకులందరికీ ఎప్పటికప్పుడు వినూత్న మైన ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. దీంతో బుల్లితెర కార్యక్రమాలు చూడ్డానికి ప్రేక్షకులు అందరూ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.  ఇక ప్రస్తుతం బుల్లితెర షో నిర్వాహకులు అందరూ మొదట ఒక అద్భుతమైన ప్రోమో విడుదల చేసి షోపై అందరికీ మరింత ఆసక్తిని పెంచుతున్నారు.  ఇలా ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాల క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ టీవీలో ప్రసారమయ్యే క్యాష్ షో ఎన్నో రోజుల నుంచి టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటుంది.



 సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోకి ప్రస్తుతం బుల్లితెరపై తిరుగులేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతి వారం కూడా నలుగురు కొత్త గెస్ట్ లను ఇన్వైట్ చేసి వారితో పలురకాల రౌండ్స్ ఆడించి..  ఇక మధ్య మధ్యలో అదిరిపోయే పంచ్ లతో బుల్లితెర ప్రేక్షకులను ప్రతివారం అలరిస్తూ ఉంటుంది సుమా.  ఇక ఇటీవలే వచ్చే వారానికి సంబంధించి క్యాష్ ప్రోమో సోషల్ మీడియాలో విడుదలైంది. ఇది కాస్త నెటిజన్లను ఆకర్షిస్తూ తెగ వైరల్ గా మారిపోయింది. ఇక ఈ సారి క్యాష్ షో లో బుల్లితేరపై గుర్తింపు సంపాదించుకున్న జాకీ హరిత దంపతులతో పాటు ప్రీతినిగమ్ నగేష్ దంపతులు కూడా గెస్ట్లుగా ఎంట్రీ ఇచ్చారు.



 జోడీలుగా వచ్చిన వీరు ఆ తర్వాత ఇక విడిపోయి ఎవరి ఆట వారు ఆడారు. ఈ క్రమంలోనే ఇక షోలో భాగంగా ఒక డిబేట్ పెడుతుంది సుమ.. మగవాళ్లు గొప్ప లేక ఆడవాళ్లు గొప్ప అని ప్రశ్న అడుగుతుంది.  ఆడవాళ్లే గొప్ప అంటూ ప్రీతినిగమ్ భర్త నగేష్ అంటాడు. లేదు లేదు అంత సింపుల్ గా చెబితే ఎలా మాకు చాలా ఫుటేజ్ కావాలి అంటూ చెబుతుంది సుమ.  ఈ క్రమంలోనే ఓ వైపు ఒక అమ్మాయిని మరోవైపు ఒక అబ్బాయి నిలబెట్టి ఎవరు గొప్ప అని అడుగుతుంది సుమ.  అమ్మాయిల గొప్ప ఎందుకంటే అమ్మాయిలు ఇంటిని మొత్తం మెయింటెన్ చేస్తారు అంటూ చెబుతుంది ఆ అమ్మాయి. ఇంతలో కల్పించుకున్న ప్రీతినిగమ్ ఆడవాళ్ళు ఇంటిని మెయింటెన్ చేస్తారు.. మగవాళ్ళు ఆంటీ ని మైంటైన్ చేస్తారు అంటూ షాకింగ్ పంచ్ వేస్తుంది. దీంతో అక్కడున్న వారందరూ షాక్ అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: