టాలీవుడ్ పాన్
ఇండియా స్టార్
ప్రభాస్ తదుపరి చిత్రం రాధే
శ్యామ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చివరి దశకు చేరుకున్న ఈ
సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా
జనవరి 14న విడుదల కాబోతుంది.
కరోనా ప్రభావం తో మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడినా ఇప్పుడు ఈ
సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. చిత్ర యూనిట్ ఈ
సినిమా అప్ డేట్స్ విషయం లో నెమ్మదిగా వ్యవహరిస్తుంది అన్న విమర్శలు తట్టుకుని ఇప్పుడు విడుదల వరకు చేరుకుంది.
ప్రచారం కూడా పెద్దగా చేయకపోవడంతో ఈ
సినిమా హిట్ అవుతుందా లేదా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
ప్రభాస్ సినిమా అంటే దేశం మొత్తం చూస్తుంది. ఆలాంటప్పుడు ప్రచారం కూడా గట్టిగా ఉండాలి. భారీ హైప్ తీసుకురావాలి కానీ ఆ విషయంలో చిత్రబృందం వెనుక పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి భారీగా ప్రణాళిక వేసిందట చిత్ర బృందం.
సెప్టెంబర్ నుంచి ఈ సినిమాకు ప్రచారం చేయాలని భావిస్తోంది. రిలీజ్ కు ఇంకా నాలుగు నెలల సమయం ఉండటంతో సీజన్ ను బట్టి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వదలాలని చూస్తున్నారు.
ముందుగా ఈ సినిమాలోని పాటలను విడుదల చేసి పాజిటివ్ బజ్ జనరేట్ చేయొచ్చని ఆలోచనతో పాటలను విడుదల చేయాలనే ఆలోచనలో ఉందట యూనిట్. పాటకు పాటకు మధ్యలో ట్రైలర్ ని కానీ, టీజర్ కానీ రిలీజ్ చేస్తే సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేయొచ్చు అని ప్రణాళిక చేస్తున్నారట. ఇకపోతే 1970 పిరియాడికల్
లవ్ స్టోరీ కాబట్టి జనాల్ని ఆ తరానికి తీసుకెళ్లాలంటే తప్పకుండా ఓ వెరైటీ ప్రమోషన్ చేసి తీరాల్సిందే అని వారు భావిస్తున్నారట. సినిమాలో దాదాపు 20 నిమిషాలకు పైగా
గ్రాఫిక్స్ సన్నివేశాలు హైలెట్ గా ఉంటాయనీ అంటున్నారు. ఈ మేరకు మొత్తం 60 స్టూడియోల్లో సిజి వర్క్ చేస్తున్నారట. సిజి లో ది బెస్ట్ కావాలంటే ఎక్కువ స్టూడియోలకు ఇస్తే మనసు పెట్టి పని చేసే అవకాశం ఉంటుంది కాబట్టి యూనిట్ అలా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.