ఈ రోజుల్లో మనిషి కి గుండె ఎంత అవసరమో మొబైల్ కూడా అంతే అవసరం. ఏ పని ఉన్నా సెల్ ఫోన్ నుంచి అన్నీ చకచకా చేస్తున్నారు. ఏది మర్చిపోయిన మర్చిపోక పోయినా మొబైల్ మాత్రం అందరికీ అందుబాటులో ఉండాల్సిందే. మన జీవితంలో ఎంతో కీలకమైన అవయవం గా మారిపోయిన ఈ మొబైల్ ప్రపంచం మొత్తం అరచేతిలో చూపిస్తూ దాని ప్రత్యేకత చాటుకుంటోంది. ప్రజలు కూడా ఎంతో ప్రాధాన్యత ను ఇస్తున్నారు ఈ మొబైల్ కి. అయితే కొంతమంది మాత్రం ఈ మొబైల్ కు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు.

అది కేవలం ఒక వస్తువు గా భావించి తమ జీవన విధానంలో చాలా సాధారణమైన విషయం గా దీన్ని భావిస్తున్నారు. వీరిలో హీరోలు కూడా ఉండడం గమనార్హం. చాలా మంది మొబైల్ ఫోన్ ను పెద్దగా ఉపయోగించరు. అసలు మొబైల్ ఫోన్ ను వాడని వారు కూడా చాలామంది. అలా మన టాలీవుడ్ లో ఫోన్ వాడని వారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు.  అలాంటి వారిలో ఒకరు మహేష్ బాబు. ఓ సందర్భంలో ఓ ఇంటర్వ్యూలో యాంకర్ సుమ అడిగిన ఓ ప్రశ్నకు మహేష్ బాబు ఆసక్తిగల సమాధానం చెప్పారు.

 మీ ఫస్ట్ ఎస్ఎంఎస్ ఎక్కడినుంచి వచ్చింది అనే ప్రశ్న ఆమె మహేష్ బాబు ను అడగగా ఆయన కూడా ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పాడు. నాకు అసలు ఆ విషయమే గుర్తుకులేదు. నేనెప్పుడూ షూటింగ్స్ లో ఫోన్ వాడను, ఒకవేళ ఎవరైనా ఫోన్ చేసినా నా మేకప్ మెన్ లేదా డ్రైవర్ కి గాని ఫోన్ చేస్తేనే మాట్లాడతాను. నా దగ్గర మొబైల్ ఉండదు. అలాంటప్పుడు ఎస్ఎంఎస్ ఏం తెలుస్తుంది అని షాక్ ఇచ్చారు. మీకంటూ ఫోన్ లేదా అని సుమ అడగగా ఉంది కానీ అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు ఫోన్ విషయం నేను పెద్దగా పట్టించుకోను. అన్నాడు నమ్రత తో పెళ్లి కాకపోయి ఉంటే ఫోన్ చాలా అవసరం ఉండేదేమో అని సుమ చెప్పగా అప్పుడు కూడా అసలు వాడే వాడినీ కాదేమో అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: