
కరోనా తరువాత టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎంతటి పీకల్లోతు కష్టాల్లో వెళ్ళిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడే ఇప్పడే చిన్న సినిమాలు థియేటర్ లలో విడుదల అవుతుండటంతో టాలీవుడ్ కోలుకుంటున్నట్లు అవుతుంది. కొ న్ని చిన్న సినిమాలు చాలా ప్రయత్నిస్తున్నా కూడా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో థియేటర్లకు తీసుకురాలేక పోతున్నాయి. దాంతో ఓ పెద్ద సినిమా వస్తే గానీ ప్రేక్షకులు థియేటర్లకు అలవాటుపడరు అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సంక్రాంతి కానుకగా భారీ సినిమాలు విడుదల అవతున్నాయి. అంతకుముందు అంటే పుష్ప, కేజిఎఫ్, ఆచార్య, అఖండ వంటి సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. కానీ ఇప్పటికి ఇప్పుడు అంటే ఏ పెద్ద సినిమా విడుదలకు నోచుకోవ డం లేదు. దాంతో మరొకసారి టాలీవుడ్ భవిష్యత్తు జక్కన్న మీదే ఆధారపడి ఉంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా అక్టోబర్ లో దసరా కానుకగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమా తో పాన్ ఇండి యా చిత్రాలకు ఆద్యుడు గా మారిన జక్కన్న టాలీవుడ్ సినిమా స్థాయిని దేశ స్థాయిలోకి తీసుకెళ్లాడు.
ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రంపై ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇద్దరు హీరోల అభిమానులు కోట్లల్లో ఉంటారు కాబట్టి తప్పకుండా ప్రేక్షకులకు సైతం ఈ సినిమాపై ఆసక్తి కలుగుతుంది. తద్వారా టాలీవుడ్ కి మళ్లీ పూర్వవైభవం వస్తుందని అంటున్నారు. ఈ సినిమాతో భారతీయ సినిమా పరిశ్రమ ను ప్రపంచవ్యాప్తంగా వినపడేలా రాజమౌళి చేస్తాడు అని అంటున్నారు. మతి దసరా కి ప్రేక్షకుల ముందుకు వస్తున్న జక్కన్న ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరించి వారిని మళ్ళీ సినిమా దియేటర్ లలోకి తీసుకువస్తాడో చూడాలి..