యువ భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కొండపొలం అనే టైటిల్ ని నిర్ణయించి కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో చిన్న గ్లింప్స్ టీజర్ ని విడుదల చేసింది యూనిట్. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై బిబో శ్రీనివాస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా వై రాజీవ్ రెడ్డి, జె సాయి బాబు ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు జ్ఞానశేఖర్ ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకి సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి కథని అందించారు. సాయి చంద్, కోట శ్రీనివాసరావు, నాజర్, అన్నపూర్ణ, హేమ, మహేష్ విట్టా, రచ్చ రవి తదితరులు ఇతర పాత్రలు చేస్తున్న ఈ సినిమా యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. మెగా ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు క్రిష్ ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 8న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఫస్ట్ సినిమాతో మంచి హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ రెండవ సినిమాతో ఏ స్థాయి సక్సెస్ అందుకుంటారో చూడాలి ....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి