ఆఫ్ఘనిస్తాన్ సైన్యంలో పోరాట పటిమ లోపించిందని ఆ దేశం నుంచి తన సేవలను ఉపసంహరణ చేసుకోవాల్సి వచ్చింది అని అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే స్పష్టత ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కానీ బల్క్ ప్రావిన్స్ లోని చాహర్ కింట్ జిల్లా స్థానిక మిలిషియా అందుకు పూర్తి భిన్నం. ఆఫ్ఘన్ నేలలో తాలిబన్ లను ఇలాంటి స్థానిక మిలిషియా ను తయారు చేసి ఓ మహిళా గవర్నర్ స్వయంగా తుపాకీ చేత బట్టి తాలిబన్ ల నుంచి రెండున్నర సంవత్సరాలకు పైగా కాపాడుకుంటూ వార్ వుమెన్ గా పేరు తెచ్చుకున్నారు.

తిరుగుబాటుదారుల చెరలో చిక్కుకున్న ఆ సాహసి సలీమ మచారి గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.  దేశ అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న తిరుగుబాటు దారులు సలీమా తో పాటు కొందరు మహిళ నాయకులను కూడా బంధించారు. తాలిబన్ల దాడి నుంచి పలు సార్లు తప్పించుకోగలిగారు కానీ ఈమె ఇప్పుడు వారికి బందీగా చిక్కడ విచారకరం. ఆఫ్ఘనిస్తాన్ లోని ముగ్గురు మహిళా గవర్నర్ లో ఈమె ఒకరు. దాదాపు అన్ని ప్రావిన్స్ లు ప్రతిఘటన లేకుండా తాలిబన్ల చేతికి చిక్కిన ఆమె తన జిల్లా ను కాపాడుకోవడం కోసం చివరి నిమిషం వరకు పోరాడారు.

32,306 మంది జనాభా ఈ జిల్లాలో నివసిస్తుండగా ఏ ఒక్క తీవ్రవాద సంస్థ ఆధీనంలోకి చేరకుండా స్వతంత్రంగా నిలదొక్కుకోవడం లో ఆమె కృషి ఎంతో ఉంది. గతంలో కూడా సోవియట్ యుద్ధ సమయంలో ఆఫ్ఘన్ లో ఆశ్రయం పొందిన సలీమా ఆ తర్వాత ఇరాన్ కు వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ టెహ్రాన్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వేరు వేరు విశ్వవిద్యాలయాల్లో సేవలందించారు. అయితే ఆఫ్ఘన్ మీద ఉన్న ప్రేమతో ఆ దేశంలో స్థిరపడి గవర్నర్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. చాహర్ కీంట్ జిల్లా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజుల్నుంచి ప్రజల మద్దతుతో ఆమె వారిలో మంచి విశ్వసనీయత పొందింది. వృత్తిపరంగా అన్ని విషయాలు అమలు చేస్తూ యుద్ధం విషయంలో మాత్రం వెనక్కి రాకుండా  ప్రజలు విప్లవాన్ని రెచ్చగొట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: