
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఒక్క అపజయం కూడా లేకుండా వరుస సినిమాల విజయాలతో నెంబర్ వన్ స్థానానికి ఎదిగిన దర్శకుడు రాజమౌళి. అలాంటి దర్శకుడి తో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో అనుకుంటాడు. పాన్ ఇండియా చిత్రాల జోరు మొదలైన తర్వాత ఇతర భాషల హీరోలు కూడా రాజమౌళి వెంట పడుతున్నారు. ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో రాజమౌళి ఎక్కువ సంఖ్యలో సినిమాలను తెరకెక్కించగా త్వరలోనే మహేష్ బాబు తో ఓ సినిమా మొదలు పెట్టానున్నాడని తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో ఇతర హీరోలతో రాజమౌళి ఎప్పుడు పని చేస్తాడు అని వారి అభిమానులు ఎదురు చూడడం జరుగుతుంది. ఆ విధంగా టాలీవుడ్ లో రాజముండ్రి తో సినిమా చేయాలని అందరు హీరో లు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు ఎదురుచూపులు కూడా చూస్తున్నారు. అలా పవన్ కళ్యాణ్ మరియు అల్లు అర్జున్ కూడా జక్కన్న తో సినిమా చేయాలని వైట్ చేస్తున్నారు. అయితే వీరి కాంబో లో ఎప్పుడో సినిమా రావాలి కానీ బాహుబలి సినిమా దాదాపు ఐదేళ్లు తీసుకోవడంతో వారితో సినిమా చేయలేకపోయాడు జక్కన్న.
బాహుబలి తర్వాత ఆర్ ఆర్ సినిమా కూడా
చివరకు ఎన్టీఆర్ చరణ్ లతో చేయాల్సి వచ్చింది. వీరితో గతం లోనే పని చేయగా డేట్ల విషయమై వీరిద్దరూ అనుకూలంగా ఉండడంతో వారితోనే ముందుకు వెళ్ళాడు. ఇక రాజమౌళి తో అల్లు అర్జున్ సినిమా చేయలేకపోయినా రాబోయే రోజుల్లో ఈ సినిమా తప్పకుండా ఉంటుంది అని అంటున్నారు. ఇప్పటికే రాజమౌళి అల్లు అర్జున్ కి సరిపడా కథలు రెడీ చేయిస్తున్నాడట. ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఆ సినిమా విడుదల అయిన తర్వాత ఇంకా ఏ సినిమా అనౌన్స్ చేయలేదు. ఐకాన్ ఇంకా చర్చ లోనే ఉంది. రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్ట్ కూడా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఇప్పుడైనా సీట్ అవుతుందో చూడాలి.