ఈయన నిజానికి ఫిట్నెస్ కు చాలా ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. చనిపోయే ముందు రోజు కూడా సిద్ధార్థ్ బాగా వర్కౌట్ చేసినట్లు సమాచారం. ముందు రోజు రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వచ్చిన తర్వాత ,పది గంటలు అప్పుడు జాగింగ్ తో పాటు మరికొన్ని వర్కౌట్ చేశాడని తెలుస్తోంది. అనంతరం నిద్రపోవడానికి వెళ్ళాడట. అప్పటికే వైద్యులు సూచించిన మేరకు మాత్రలు కూడా వేసుకున్నాడు సిద్ధార్థ్. తెల్లవారుజామున 3 గంటలకు ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే తన తల్లికి సమాచారం కూడా ఇచ్చాడు.
ఇక ఆమె స్వయంగా సిద్ధార్థకు నీళ్లు కూడా తాగించింది. నిద్రపోయిన సిద్ధార్థ నిద్ర నుంచి మేలుకో లేదని ఇక హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆ తర్వాత సిద్ధార్థ్ గురువారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు స్వర్గస్తులయ్యారు. సిద్ధార్థ్ కి డాక్టర్లు ఎంత చెప్పినప్పటికీ వర్కౌట్ సమయాన్ని మాత్రం తగ్గించుకో లేకపోయాడు .ఎక్కువగా వర్క్ ఔట్ లు చేయడం వల్ల ప్రాణానికే ప్రమాదమని చెప్పినప్పటికీ, ఏమాత్రం లెక్క చేయక పోవడంతో ఇలా జరిగిందని
వైద్యులు చెబుతున్నారు..
ముఖ్యంగా ఆర్థికంగా కూడా కొన్ని ఇబ్బందులతో పాటు ఒత్తిడి కారణంగా కూడా ఈయన చిన్న వయసులోనే గుండెపోటు రావడం జరిగింది. ఎవరైనా సరే మానసికంగా ప్రశాంతంగా ఉండాలి కానీ ఫిట్నెస్ కోసం అధికంగా ఇలాంటివి చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి