అక్కినేని నటవారసుడుగా సినిమాల్లోకి వచ్చి అక్కినేని నాగచైతన్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఫలితాలతో సంబంధం లేకుండా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకుని ప్రేక్షకులను ఎంతో అలరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన లవ్ స్టోరీ సినిమా విడుదలకు సిద్ధమయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా సంతోషపడ్డారు.

అయితే అనుకోకుండా జరిగిందో కావాలనే అదే తేదీన విడుదల చేయడం జరిగిందో తెలియదు కానీ సెప్టెంబర్ 24వ తేదీ అక్కినేని ఫ్యామిలీకి స్పెషల్ రోజు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇదే రోజున అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ప్రేమ నగర్ సినిమా విడుదల అయ్యింది. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అక్కినేని కెరీర్లోనే స్పెషల్ మూవీగా నిలిచిన ఈ చిత్రం 1971 వ సంవత్సరంలో విడుదల కాగా కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వం లోని సినిమా ప్రేక్షకులను అలరించింది.  మూవీ మొగల్ డాక్టర్ డి.రామానాయుడు నిర్మాతగా చేయగా వాణిశ్రీ హీరోయిన్ గా చేసింది.

అయితే ఇంతటి గొప్ప రోజున లవ్ స్టోరీ సినిమా విడుదల అవబోతుండడంతో అక్కినేని అభిమానులు ఎన్నో సంబరాలు చేసుకుంటున్నారు. తప్పకుండా ఈ సినిమా కూడా ప్రేమ్ నగర్ లాగానే సూపర్ హిట్ అవ్వడం ఖాయం అని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయి ప్రేక్షకుల అంచనాలను మరింత రెట్టింపు చేసింది. పాటలతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న ఈ సినిమా సినిమా పరంగా కూడా అదే రేంజ్ లో అలరిస్తుందని భావిస్తున్నారు చిత్ర యూనిట్. ప్యూర్ ప్రేమకథ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రేవంత్ గా అక్కినేని నాగ చైతన్య మౌనిక గా సాయి పల్లవి నటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: