ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ కలిసి ఎంతో భారీ వ్యయంతో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా రిట్రో లవ్ స్టోరీ గా కొన్నేళ్ల క్రితం యూరోప్ దేశంలో జరిగిన ఒక యదార్ధ కథకు రూపంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీలో విక్రమాదిత్య గా ప్రభాస్, అలానే ప్రేరణ గా పూజా హెగ్డే నటిస్తుండగా పరమహంస అనే ముఖ్య పాత్రలో సీనియర్ రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించనున్నారట.

ఇక ఈ మూవీ సౌత్ వెర్షన్స్ కి జస్టిన్ ప్రభాకరన్ అలానే హిందీ వర్షన్ కి మిథూన్ మన్నన్ సంగీతం అందిస్తుందా మనోజ్ పరమహంస ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం పలు దేశాల్లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నట్లు సమాచారం. 2020 జనవరి లో సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా రాధేశ్యామ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ భారీ సినిమాకి సంబందించి ప్రస్తుతం ఒక న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

అదేమిటంటే, ఈ సినిమాకి కొనసాగింపుగా రాధేశ్యామ్ పార్ట్ 2 కూడా ఉండనుందట. ఫస్ట్ పార్ట్ లో వచ్చే ఎమోషనల్ క్లైమాక్స్ తరువాత కొనసాగిస్తూ పార్ట్ 2 తీసేలా మేకర్స్ ప్రస్తుతం ప్రణాళికలు చేస్తున్నారట. అలానే దీనిపై త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా రానునంట్లు టాక్. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ కనుక నిజం అయితే బాహుబలి భారీ సినిమాల తరువాత మరొక్కసారి ప్రభాస్ నటించే రెండు భాగాల సినిమా రాధేశ్యామ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: