కొణిదెల శివ శంకర వరప్రసాద్  ఈ పేరు అందరికి తెలియకపోవచ్చు కాని కొందరికి మాత్రం ఈ పేరు వింటే ఊగి పోతారు. అదేనండి చిరంజీవి గారి అస్సలు పేరు. ఈ  పేరు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది వుంటారు. అది చిరంజీవి అభిమాని అయి వుంటారు. అయితే చిరంజీవి పేరంటే అంటే మాత్రం ప్రపంచంలో ఉన్న తెలుగు వారికీ అందరికి తెలుసు.ఆగస్ట్ 22న జన్మించిన చిరంజీవి సెప్టెంబర్ 22న నటుడిగా ప్రేక్షకులకి పరిచయం అయ్యారని సమాచారం.

చిరంజీవి నటించిన తొలి సినిమా 'పునాది రాళ్లు' అయినా ముందుగా 'ప్రాణం ఖరీదు' చిత్రంతో ప్రేక్షకులకి పరిచయం అయ్యారట చిరంజీవి.1978 సెప్టెంబరు 22న ఈ సినిమా విడుదలైందని సమాచారం.

నిన్నటితో చిరు నటించిన తొలి చిత్రం 43 ఏళ్లు పూర్తి చేసుకుందని సమాచారం. ఈ సందర్భంగా చిరంజీవి తనపై ఇంతటి ప్రేమాభిమానాలు చూపిస్తోన్న అభిమానులకి చిరంజీవి ధన్యవాదాలు తెలియజేశారని సమాచారం.. 'ఆగస్టు 22 నేను పుట్టిన రోజైతే, సెప్టెంబరు 22.. నటుడిగా పుట్టినరోజు అని చిరంజీవి భావొద్వేకమైన పోస్ట్ పెట్టినట్లు సమాచారం. కళామ్మతల్లి నన్ను దగ్గరకు చేర్చుకున్న రోజు అలాగే నటుడిగా పరిచయమై మీ అందరి ఆశీస్సులు పొందినరోజు అదేవిధంగా నేను ఎప్పటికి మరిచిపోలేనిరోజు ఇది అని చెప్పుకొచ్చారాట చిరంజీవి. దీనికి కారణమైన నా సోదరసోదరీమణులకు ధన్యవాదాలు' అని పేర్కొన్నారని తెలుస్తుంది.అలానే తన మొదటి సినిమా పునాది రాళ్లు నాటి టైం ఫోటోని కూడా తన సోషల్ మీడియా డీపీ గా పెట్టుకున్నారని సమాచారం..

చిరు సినీ ప్రస్థానంపై రామ్ చరణ్ తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. '43 ఏళ్ల సినీ ప్రస్థానం ఇంకా కొనసాగుతుంది. చూడండి మా నాన్న' అంటూ తన తండ్రి మొదటి సినిమా నాటి ఫోటోమరియు అలాగే ఇప్పుడు చేస్తున్న ఆచార్య సినిమా ఫోటోని జత చేసి పోస్ట్ చేశారని సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ పోస్ట్ వైరల్‌గా మారిందని తెలుస్తుంది. చిరంజీవి మోహన్‌ రాజా దర్శకత్వంలో 'గాడ్‌ ఫాదర్‌',అలాగే మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో 'భోళా శంకర్' చిత్రాల్లో నటిస్తున్నారని సమాచారం. కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ చిత్రం ప్రకటించి నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: