1969లో గాయకుడిగా తన సినీ ప్రస్థానం మొదలు పెట్టిన ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆ తర్వాత వరుసగా పాటలు పాడే అవకాశాలు అందుకుని తక్కువ కాలంలోనే పెద్ద గాయకుడిగా మారాడు.మంచి స్వరంతో హీరో ల బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా పాడుతూ సదరు హీరోల అభిమానుల అభిమానాన్ని చూరగొన్నాడు. తన పాటలలో స్వర మాధుర్యాన్ని పంచుతూ అతను చేసే ఉచ్చారణ అన్ని కలిపి ఆయన కీర్తి ఎంతో దూరం వెళ్లేలా చేసింది. అందుకే అమర గాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినిమా పాటకు సిసలయిన వారసుడిగా నిలిచాడు ఎస్పీ బాలసుబ్రమణ్యం.

40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డును సృష్టించిన వ్యక్తిగా పేరుప్రఖ్యాతులు పొందాడు. తెలుగు మాత్రమే కాకుండా తమిళ కన్నడ భాషలలో ఆయన పాడిన పాటలు ఆయనకు జాతీయ పురస్కారాలు లభించెలా చేశాయి. బహుముఖ ప్రజ్ఞాశాలి గా ఈ గాన గంధర్వుడు తన సత్తా ను నిరూపించుకున్నాడు. కేవలం గాయకుడి గా మాత్రమే నటుడి గా తనను తను నిరూపించుకున్నాడు. సహాయక పాత్రల్లో నే కాకుండా కథానాయకుడు కూడా ఆయన ఓ సినిమాలో నటించాడు అంటే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే.

సినిమా కి నంది పురస్కారం కూడా లభించింది. ఇప్పటికే ఆయన హీరోగా నటించిన సినిమా మీ అందరికీ తెలిసే ఉంటుంది. 2012వ సంవత్సరంలో తనికెళ్ల భరణి దర్శకత్వంలో తెరకెక్కిన మిథునం సినిమాలో ఆయన కథానాయకుడిగా నటించి నంది పురస్కారాన్ని గెలుచుకున్నాడు. ఇందులో అలనాటి నాయిక లక్ష్మి కథానాయికగా నటించింది. కేవలం రెండు పాత్రలతోనే సాగే ఈ చిత్రం లో ఆద్యంతం తన నటనతో ప్రేక్షకులను అలరించాడు బాలసుబ్రమణ్యం. తనికెళ్ళ భరణి దర్శకత్వం లక్ష్మీ క్లాసిక్ నటన కలిపి ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేలా చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: