రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్నాయి. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ అలాగే హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇద్దరు స్వతంత్ర సమరయోధులు స్వాతంత్య్రం కోసం పోరాటం చేయక ముందు కలిస్తే అక్కడ ఏ విధమైన పరిస్థితులు ఏర్పడతాయి. అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అన్న అంశంపై ఈ సినిమా తెరకెక్కుతుంది. విజయేంద్రప్రసాద్ ఎప్పటిలాగే తన కలం నుంచి ఓ అద్భుతమైన కథ రాసినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ కొమురం భీమ్ గా,  అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ నటిస్తున్న సినిమా ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ పోన్ కాగా మూడవ సారి జనవరి 7వ తేదీన విడుదల పక్కగా ఉండబోతుంది అని తెలుస్తుంది.

ఆ రోజున వేరే సినిమాల విడుదల లు ఉన్నా కూడా లెక్క చేయకుండా రాజమౌళిసినిమా విడుదలను ప్రకటించేశాడు. దాంతో ఆ సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశాడు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేయగా మేకింగ్ వీడియోను విడుదల చేసి సినిమాపై అంచనాలను పెంచాడు. తాజాగా అక్టోబర్ 29వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ఓ సర్ప్రైజ్ వీడియో విడుదల చేయబోతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇకపోతే ఈ సినిమా తర్వాత రాజమౌళి తన తదుపరి సినిమా ను మహేష్ బాబు తో ప్లాన్ చేయగా ఎన్టిఆర్ కొరటాల శివ తో, రామ్ చరణ్ శంకర్ లతో సినిమాలు చేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr