దసరా సందర్భంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పలు చిత్రాలు విడుదల అయ్యాయి. వాటిలో కొన్ని విజయవంతం కాగా ఇంకా కొన్ని ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ని సినిమాల్లో ఒక సినిమా మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అది కూడా ఓ తమిళ డబ్బింగ్ సినిమా కావడం విశేషం. శివ కార్తికేయన్ హీరో గా నటించిన వరుణ్ డాక్టర్ సినిమా దసరా సందర్భం గా థియేటర్ లలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

మంచి కథ, వెరైటీ కథనం తో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు అన్ని రకాల ఎమోషన్స్ ను అందించి హిట్ టాక్ తెచ్చుకుంది. వాస్తవవానికి అప్పుడు విడుదలయిన తెలుగు సినిమాలను తలదన్నే విధంగా ఈ సినిమా నిలిచింది అని చెప్పొచ్చు. ఈ సినిమా కి సరైన పబ్లిసిటీ ఇవ్వలేదు కానీ ఆ పబ్లిసిటీ ఇస్తే బాగుండేదని సినిమా కు కొంచెం హైప్ క్రియేట్ చేసినా బాగుండేదని అని చుసిన ప్రేక్షకులు భావిస్తున్నారు.. అయితే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో చుస్తునారు.

సినిమా బాగుందని అందరు చెప్పినా కూడా ధియేటర్ లలో ఈ సినిమా కనిపించకపోవడం సినిమా చూద్దాం అనుకున్నవారికి నిరాశ కలిగిస్తుంది. అయితే ఇది ఓ టీ టీ లో విడుదల అయితే చూడాలని చూస్తున్నారు ప్రేక్షకులు. దాంతో ఈ సినిమా ఓటీటీ విడుదల ఎప్పుడెప్పుడా అని చూస్తున్నారు. వాస్తవానికి తెలుగు లో విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మరియు మహా సముద్రం సినిమాల కంటే ఎక్కువగా ఈ సినిమా ఓటీటీ కోసం చూస్తున్నారు. మరి ఈ సినిమా ను ఎప్పుడు ఓటీటీ లో విడుదల చేస్తారో మేకర్స్ చూడాలి. ఇప్పటికే పలువురు తమిళ హీరో లో తెలుగు లో మంచి మార్కెట్ ను తెచ్చుకోగా శివకార్తికేయన్ ఈ సినిమా తో మంచి మార్కెట్ సంపాదించాడని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: