సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరియు దగ్గుబాటి రానా హీరోలుగా చిత్రం భీమ్ల నాయక్. త్రివిక్రమ్ రచయితగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఇద్దరు హీరోల కు సంబంధించిన రెండు టీజర్లు విడుదల అయ్యాయి. అవి ఎంతటి సంచలనం సృష్టించాయి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు కలసి ఉన్న టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. త్వరలోనే దాన్ని విడుదల చేస్తామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించగా ప్రేక్షకులు సైతం ఈ టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకు వెళ్లాడు. అందులో మొదటగా ఈ చిత్రం విడుదల అవుతుండగా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోషియం అనే సినిమాకు రీమేక్ గా ఇది తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్ సరసన నిత్యమీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా దగ్గుబాటి రానాకు జంటగా మలయాళ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా చేస్తుంది. ఆ విధంగా ఈ సినిమా అన్ని రకాలుగా పాపులారిటీ ఏర్పరుచుకుని హిట్ కొట్టడానికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

అయితే సినిమా మరొక టీజర్ ను దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ పవన్ అభిమానులకు మాత్రం ఇది ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది. పవన్ కళ్యాణ్ రానా కలసి నటిస్తున్న ఈ సినిమాలోని ఈ ఇద్దరూ కనిపించబోతున్న టీజర్ ను చూసి ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా భావిస్తున్నాడు. ఆ విధంగా ప్రేక్షకులు కనువిందు చేయనున్న ఈ టీజర్ దీపావళి కి వచ్చి ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా కి తమన్ సంగీతం సమకూర్చగా ఇప్పటికే విడుదలైన పాటలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: